1. అంతర్జీవ ద్రవ్య జాలకం (Endoplasmic Reticulum)
ఉనికి – స్వరూప లక్షణాలు
కణాంతర్భాగంలో కణ పదార్థం ఉంటుంది. ఇది కణం నిండా ఆయతనంగా (Bulk) ఉండే సాక్షిక పారదర్శక (Translucent), సమజాత (Homogeneous), కాంజికాభ (Colloidal) పదార్థం. ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శిని సహాయంతో దీన్ని పరిశీలించినప్పుడు దీనిలో ఒక జటిల త్వచాగమనం (Complex membranous labyrinth) కనిపిస్తుంది. దీన్నే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం (ER) అంటారు. మిగిలిన జల ద్రావణాన్ని హయలో ప్లాసం (Hyaloplasm) అంటారు. కణ నిర్మాణ వ్యవస్థలో ER ముఖ్య పాత్ర వహిస్తుంది.
మొదటి సారిగా దీన్ని 1945 లో పోర్టర్ మొదలయిన వారు (Porter etal) నిర్ధారణగా వర్ణించారు. గార్నియర్ (Gamier) మొట్ట మొదటిసారిగా 1897లో క్లోమ కణాల్లోను, గ్రంథి కణాల్లోను ప్రత్యేక క్షార రంజనాల పట్ల బంధక బలంలో (Affinity) ఉన్న త్రం (Area) గా వర్ణించాడు. క్షేత్రంలో తంతువుల వంటి నిర్మాణాలున్నాయని ఇవి చిరస్థాయిగా (Permanent) ఉంటున్న నిర్మాణాలు కావని, వాటి స్థితి కణానికున్న చర్యాశీలత (Activity) ను బట్టి మారుతూ ఉంటుందని పేర్కొన్నాడు. ఈ క్షేత్రంలో ఉన్న పదార్థాన్ని అతడు ఎర్గాస్టోప్లాసమ్ (Ergastoplasm) అన్నాడు. ఇలాంటి క్షేత్రమే తక్కిన కణాల్లో కూడా ఉంటుందని పేర్కొన్నాడు. మన్ని (Monne) 1944లో కణపదార్థంలో ప్రోటీన్ తంతువులు ఒక వలగా అల్లుకొని మధ్యాంతరాలను రైబోకేంద్రకామ్ల పూరిత కణికలలో, మైటోకాండ్రియన్స్ లో నింపుకొని ఉంటాయని వెల్లడిచేశాడు. ఇది ఎండోప్లాసమ్ కు మాత్రమే పరిమితమై లేదని, ఇది ఒక జటిల త్వచాగహనమని తేలింది. ఈ గహనం కణమంతా పాకి ఉన్న అంతర్ సుధాన (Inter connecting) త్వచ నిర్మాణాల సమూహం.
ఈ త్వచాగహనం ఒక వైపు ఉన్న కేంద్రక త్వచంతో మరొక వైపు కణ పరిధిలో ఉన్న కణ త్వచంతోను సంబంధం పెట్టుకోవచ్చు. ఈ గహనానికి చెందిన త్వచ నిర్మాణాలు మూడు ముఖ్య ఆకృతులలో ఉంటాయి.
అవి : (1) సిస్టర్నాలు; (2) ఆశయాలు; (3) నాళికలు.
ఎ) సిస్టర్నాలు లేదా లామెల్లాలు : ఇవి శాఖా రహితమై బల్లపరుపుగా ఉన్న పొడవుగా ఉన్న 40 నుంచి 50 మిల్లీ మైక్రాను వ్యాసంతో ఉన్న కట్టల లాంటి నిర్మాణాలు. ఇవి సమాంతరంగా ఉన్న గడ్డి మోపుల లాగా ఉంటాయి. ఈ సిస్టర్నాల యొక్క వెలుపలి పొరలో రైబోసోములుంటాయి. ప్రోటీను సంశ్లేషణ జరిగే కణాల్లో ఈ నిర్మాణం అధికంగా ఉంటుంది.
(బి) ఆశయాలు : ఇవి అండాకారంగా గాని, ఆకార రహితంగా గాని ఉన్న 50 మిల్లీ మైక్రాన్ల వ్యాసంతో గల ఆశయాల లాగా ఉంటాయి. వీటిలో రైబోసోములుంటాయి.
(సి) నాళికలు : ఇవి శాఖీయమైన నాళికల లాగా ఉండి వల లాగా ఏర్పడతాయి. ఇవి 50 – 100 మిల్లీ మైక్రాన్ల వ్యాసంతో ఉంటాయి. వీటిలో కూడా రైబోసోములుండవు. ఈ నిర్మాణాలు చారల కండరాలు మొదలయిన స్త్రీవరహిత కణాల్లో ఉంటాయి.
(డి) రసాయనిక నిర్మాణం: అంతర్జీవ ద్రవ్య జాలకం ముఖ్యంగా లైపోప్రోటీన్లతో చేసి ఉంటుంది. లిపిడ్లు లెసిథిన్, సెఫాలిన్, స్పింగోమైలిన్ రూపంలో ఉంటాయి. ద్రవ్య జాలకంలో అనేక ఎంజైమ్లు కూడా ఉంటాయి. అవి :
1. నూక్లియోటైడ్ డై పాస్ఫెట్
2. NADH డై ఫోరేజ్ గ్లూకోజు 6-ఫాస్ఫటేజ్
3. NADH – సైటోక్రోము రీడక్రేజ్
4. 4. Mg** ఉత్తేజపరచిన ATP-ase
5. సుక్రేజులు
6. గ్లిసరైడ్ల సంశ్లేషణతో సంబంధమున్న ఇతర ఎంజైమ్లు
7. పదార్థాల రవాణాలో సంబంధమున్న అనేక వాహక ఎంజైమ్ లు లేదా పర్మియేజులు.
విధులు
1. ప్రోటీన్ల సంశ్లేషణ: కణికామయ అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క ముఖ్యమైన విధి ప్రోటీన్ల సంశ్లేషణ. ఎంజైమ్లు, అమైనో ఆమ్లాలు, రైబోసోములు కలిసి ప్రోటీన్ల సంశ్లేషణ జరపడానికి కావలసిన స్థలాన్ని అంతర్జీవ ద్రవ్య జాలకం ఏర్పరుస్తుంది. గ్లైకో ప్రోటీన్ల సహాయంతో రైబోసోములు అంతర్జీవ ద్రవ్య జాలకంతో కలిసి పాలి పెప్టైడ్ గొలుసుల నేర్పరుస్తుంది. ఈ గొలుసులు సిస్టర్నాల కుహరంలోకి పంపడం జరుగుతుంది.
2 యాంత్రిక ఆధారం: ఎండో ప్లాస్మిక్ రెటిక్యులం కణానికి భౌతికాధారాన్ని, దృఢత్వచాని సమకూరుస్తుంది. కాబట్టి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కణాస్థి పంజరంగా వర్ణించడం జరిగింది.
3) పారగమ్యత: ప్లాస్మాలోచన లాగా ద్రవ్యజాలకం కూడా అర్ధ పారగమ్యత (semi permeability) వరణాత్మక అభిగమనాలను (Selective Permeabilityలుంది. దీనిలో పర్మియజులు కూడా ఉంటాయి. అందువల్ల అంతం అయ్యిం * స్మాసిస్, వ్యాపనం, క్రియాశల అభిగమనం మొదలయిన పద్ధతు, ఎంఎల్వలు లాగా అయాన్ల, పరమాణువుల వినిమయానికి తోడ్పడతాయి.
4. రవాణా లేదా ప్రసరణ వ్యవస్థ: అంతర్జీవ ద్రవ్యజాలకం ఒక విధమైన ప్రసరణ వ్యవస్థ లాగా పనిచేస్తుంది. కణికామయ ద్రవ్య జాలకం అనేక స్రావక పదార్థాలను కణికా రహిత ద్రవజాలకానికి అందజేస్తుంది. ఆ పదార్థాలకు కొన్ని రసాయనిక చర్యలు జరిగిఈనాత గాల్టీ నిర్మాణాలకు అందజేయడం జరుతుంది. గాల్టీ నిర్మాణాలు కార్బోహై స్టేట్లు, ప్రోటీన్లను సంశ్లేషణ చేసిన తరవాత ఆ ఆ లిపిడ్లతో కలిసి గైకోప్రోటీన్లు, సైపోప్రోను ఏర్పడతాయి. ఈ పదార్థాలను నిన్మాణాలు కణంలోని వివిధ ప్రదేశాలకు పంపి జీవన క్రియలు జరిగేటు చేస్తాయి.
5.పదార్థాల శోషణ: టైగ్లిసరైడ్లు, ఫాస్ఫోలిపిడ్లు, గ్లైకోలిపిడ్లు, కొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్ మొదలయిన పదార్థాల సంశ్లేషణతో సంబంధం గల అనేక ఎంజైమ్ అంతర్లీన ద్రవ్య జాలకంలో ఉంటాయి.
6. రేకిత కండరాల సర్కో ప్లాశమ్ ప్రచోదనలను కణం పరిడి నుండి అంతర్గతహంగా ఉన్న మయో ఫైబృన్ లకి అంద చేయడం లో తోడ్పడతాయి
7. కేంద్రక త్వచం ఏర్పడటం: కణ విభజనలో ప్రథమ దశ చివరన కేంద్రక త్వచం ముక్కలుగా విడిపోయి చిన్న చిన్న ఆశయాలనేర్పరుస్తాయి. తరవాత దశల్లో అవి పరిధీయంగా ధ్రువాల వద్దకు పయనిస్తుంది. అంత్య దశలో క్రోమోసోములు రెండు ధ్రువాల వద్దకు చేరేప్పుడు ఈ ఆశయాలు, అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క చిన్న చిన్న ముక్కలు పిల్ల కేంద్రకం చుట్టూ కలిసికొని కొత్త కేంద్రకత్వచం నేర్పరుస్తుంది.
8. గ్లైకోజెనాలిసిస్ : NADH డైఫోరెజ్, గ్లూకోజు-6 ఫాస్ఫటేజ్ సహాయంతో కణికా రహిత అంతర్జీవ ద్రవ్యజాలకం గ్లైకోజనను గ్లూకోజుగా మార్చుతుంది. ఈ ప్రక్రియను గ్లైకోజెనాలిసిస్ అంటారు.
9. డీటాక్సిఫికేషన్: విష పదార్థాలను విషరహిత పదార్థాలుగా మార్పు చేసే విధానాన్ని డీటాక్సిఫికేషన్ అని అంటారు. ఈ ప్రక్రియలో కణికా రహిత అంతర్జీవ ద్రవ్యజాలకంలో ఉన్న ఎంజైమ్లు ముఖ్య పాత్ర వహిస్తాయి. మందులు, అధిక కొవ్వు ఆమ్లాలు, స్టిరాయిడ్లు రక్తం లోని హీమ్ పదార్థం, మొదలయినవి విషరహిత పదార్థాలుగా మార్పు చేయబడి శరీరం నుంచి బయటికి పంపడం జరుగుతుంది.
అంతర్జీవ ద్రవ్యజాలక ఉద్భవం
అంతర్జీవ ద్రవ్య జాలక ఉద్భవం పై అనేక సిద్ధాంతాలు వెలువడ్డాయి.
అవి రెండు రకాలు.
1. ప్లాస్మాత్వచం కణం లోపలికి ముడతలు పడి దాని నుంచి వేరుపడిగాని దానితో కలిసి ఉండి గాని అంతర్జీవ ద్రవ్యజాలక మేర్పడుతుందని పలెడె అనే శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించాడు.
2. భౌతిక రసాయనికి నిర్మాణాల్లో కేంద్రక త్వచం, అంతర్జీవ ద్రవ్యజాలకాలు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ద్రవ్యజాలకం కేంద్రకత్వచం నుంచి ఏర్పడవచ్చునని ఇంకొక భావన. కణ విభజన సమయంలో అంతర్జీవ ద్రవ్య జాలకం కేంద్రకత్వచ నిర్మాణంలో పాల్గొనడం ఈ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది.
కేంద్రక త్వచం బెత్లనే వేళ్ళ వంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. దీన్నే న్యూక్లియర్ బైబ్బింగ్ అంటారు. ఈ నిర్మాణాలు కేంద్రక త్వచం నుంచి వేరుపడి జీవ ద్రవ్యంలో ఒక దానితో ఒకటి కలిసి లామెల్లాల నేర్పరుస్తుంది. 2 నుంచి 12 లామెల్లాలు ఒక గుంపుగా కట్టలాగా ఏర్పడి రైబోసోములను సంతరించుకొని కణికామయ అంతర్జీవ ద్రవ్య జాలకంగా ఏర్పడుతుంది. లామెల్లాలలో రైబోసోములు లేని ఎడల అది కణికా రహిత అంతర్జీవ ద్రవ్య జాలకంగా మారుతుంది.