ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) (Assistant Public Prosecutor) పోస్టుల భర్తీకి నోటిఫికే షన్ వెలువడింది. స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మొత్తం 42 ఏపీపీ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే ఆకర్షణీయ వేత నంతోపాటు సుస్థిర కొలువు సొంతం చేసు కోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏపీలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు..
Table of Contents
ముఖ్య సమాచారం (Assistant Public Prosecutor)
దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11.08.2025
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.09.2025
PDF కొరకు కింద క్లిక్ చేయండి
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. పోస్టుల సంఖ్య:42
జోన్ 1(విశాఖపట్నం రేంజ్)-13
జోన్ 2 (ఏలూర్ రేంజ్)-12
జోన్ 3(గుంటూర్ రేంజ్)-12
జోన్ 4(కర్నూల్ రేంజ్)-4)
అర్హతలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్మీడియెట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులే. దీంతోపాటు 04.08.2025 నాటికి రాష్ట్రం లోని క్రిమినల్ కోర్టుల్లో న్యాయవాదిగా కనీసం మూడేళ్లు ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి.
వయసు
01.07.2025 నాటికి వయసు 42 ఏళ్లకు మించ రాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష(పేపర్1, పేపర్ 2), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
రాత పరీక్ష
రాత పరీక్షలో రెండు పేపర్లు పేపర్1, పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. ఇందులో 200 ప్రశ్నలు ఉంటాయి.
పేపర్ 2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో 200 మార్కులకు నిర్వహిస్తారు. రెండు పేపర్ల ప్రశ్న పత్రాలు ఇం గ్లిష్ లోనే ఉంటాయి.
ప్రతి పేపర్ పరీక్ష వ్యవధి మూడు గంటలు. డిస్క్రిప్టివ్ పేపర్ను కొశ్చన్ – కమ్-ఆన్సర్ బుక్లెట్పై బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్నుతో రాయాల్సి ఉంటుంది.
రాత పరీక్షలో అర్హత సాధించేందుకు ప్రతి పేపర్ లో ఓసీలు కనీసం 40 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీలు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి.
రాత పరీక్షలోని రెండు పేపర్లు కలిపి మొత్తం 400 మార్కులకు అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా 1: 2 నిష్పత్తి(పోస్టుల సంఖ్యకు రెట్టింపు) లో ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూకు 25 మార్కులు కేటాయించారు. రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూలోనూ ప్రతిభ చూపిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు.