10th, Inter, Degree అర్హత తో ప్రభుత్వ ఉద్యోగాలు | Staff Selection Commission Recruitment 2021 | 3,261 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

staff selection commission staff selection commission recruitment 2020 staff selection commission exam date 2020 staff selection commission 2021 staff selection commission exam 2021 staff selection commission login staff selection commission gd

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission ) కొన్ని పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది 

👉10th, Inter, Degree అర్హత తో ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు 
ఈ నోటిఫికేషన్ లో కొన్ని విభాగాల్లో ఎస్ఎస్‌సీ ఖాళీలను భర్తీ చేస్తుంది.  మొత్తం 3,261 పోస్టులు ఖాళీలు ఉన్నాయి  
ముఖ్య సమాచారం 
👉దరఖాస్తుకు అక్టోబర్ 25, 2021 
ఫీజు చెల్లించేందుకు అక్టోబర్ 28, 2021 రాత్రి 11.30 
బ్యాంక్ ద్వారా చలాన్ రూపంలో ఫీజు చెల్లించేందుకు నవంబర్ 1, 2021 
పోస్టుల ఎంపిక పరీక్ష ద్వారా జనవరి 2022 లేదా ఫిబ్రబరి 2022లో నిర్వహిస్తారు. 
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత పరీక్ష తేదీలు విడుదల చేస్తారు.
👉పూర్తి వివరాల కొరకు కింద క్లిక్ చేయండి👇



Click Here


ఎంపిక విధానం

– ఈ పోస్టుల భర్తీకి ప్రాథమికంగా కంప్యూటర్ బెస్డ్ (Computer Based Exam) పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష సమయం – 60 నిమిషాలు
– ఇది అబ్జెక్టీవ్ టైప్ (Objective type) ప్రశ్నలను కలిగి ఉంటుంది. అయితే పోస్టును బట్టి విద్యార్హతను బట్టి మూడు పరీక్షల వరకు నిర్వహించే అవకాశం ఉంది.
– పరీక్ష రాసే అభ్యర్థులు ఆచితూచి సమాధానం పెట్టాలి. ప్రతీ తప్పు ప్రశ్నకు 0.50 మార్కులు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
– పరీక్ష ఉత్తీర్ణులైన వారిని నైపుణ్య (Skill) పరీక్షకు పిలుస్తారు. ఎంపిక విధానంలో దరఖాస్తు చేసుకొన్న పోస్టుల ఆధారంగా ఉంటుంది.
పరీక్ష విధానం
మొత్తం 4 సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు ఉంటాయి 
జనరల్ ఇంటలిజన్స్ లో 25 ప్రశ్నలు , 50 మార్కులు 
జనరల్ అవెర్నెస్ లో 25 ప్రశ్నలు , 50 మార్కులు
క్వాంటిటేవ్ ఆప్టిట్యూడ్ లో 25 ప్రశ్నలు , 50 మార్కులు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 25 ప్రశ్నలు , 50 మార్కులు 
అర్హత 
విద్యార్హతలు పోస్టుల వారీగా మారుతూ ఉంటుంది. పదోతరగతి ఉత్తీర్ణతతో కొన్ని ఉద్యోగాలు, 12వ తరగతి ఉత్తీర్ణతతో కొన్న ఉద్యోగాలు ఉండగా పలు పోస్టులకు గరిష్ట విద్యార్హత గ్రాడ్యుయేషన్‌గా ఉంది. 
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హత కనీస వయసు 18 సంత్సరాలు ఉంది. చాలా పోస్టులకు గరిష్ట వయసు 30 ఏళ్లుగా ఉంది. అయితే రిజర్వేషన్‌ల ప్రకారం ఆయా విభాగాల వారీకి వయోపరిమిత సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం
Step 1: దరఖాస్తు ప్రక్రియ రెండు భాగాలుగా ఉంటుంది.
Step 2: ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ను సందర్శించాలి.
Step 3: అందులో NOTICES లోకి వెళ్లి, OTHERS విభాగంలో నోటిఫికేషన్ చదవాలి. అనంతరం హోం పేజీకి వచ్చి దరఖాస్తు ప్రక్రియ మొదలు పెట్టాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4: మొదట వన్‌టైం రిజస్ట్రేషన్ చేసుకోవాలి.
Step 5: అభ్యర్థి ప్రాథమిక విద్యార్హత, పాస్‌పోర్టు ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫాం సబ్‌మిట్ చేయాలి.
Step 6: ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థికి రిజిస్ట్రేషన్ నంబర్‌, పాస్ వర్డ్ వస్తాయి.
Step 7: రెండో భాగంలో రిజిస్ట్రేషన్ నంబర్ పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
Step 8: అనంతరం ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో క్లిక్ చేసి సమాచారం , ఫీజు చెల్లించి సబ్‌మిట్ చేయాలి.
Step 9: పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం క్యాటగిరీ అభ్యర్థులకు, మహిళలకు పరీక్ష ఫీజు లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page