1. పేరమీషియం
ఇది నమూనా శైలిక జాతి, ఈ జాతిలో ఎనిమిది ప్రజాతులు ఉంటాయి. వీటిలో గల సూక్ష్మ కేంద్రకాన్ని బట్టి రెండు సమూహాలు. అవి : కాడేటమ్ రకం, ఆరిలియా రకం. పేరామీషియం కాడేటం గురించి వివరించడమైంది.
1.ఆవాసం, అలవాట్లు
దీన్ని సాధారణంగా ‘స్లిప్పర్ ఎనిమల్ క్యూల్” (slipper animal cule) అంటారు. ప్రపంచం అంతటా కనిపించే మంచినీటి జంతువు. ఈ స్వేచ్ఛా శైలిక జీవి సేంద్రియ పదార్థాలు ఎక్కువగా గల నీటిలో సాధారణంగా కనిపిస్తుంది.
1.2 సంవర్ధనం (Culture)
ప్రయోగశాలలో పేరమీషియమ్ ను సులభంగా పెంచవచ్చు. సంవర్ధన మాధ్యమాన్ని (medium) తయారు చేయడానికి కొద్దిగా ఎండు గడ్డి ముక్కలు లేదా ఎండిన ఆకులు లేదా గోధుమ పిండిని నీటిలో ఉడికించి వెడల్పు మూతగల జాడీలో ఉంచాలి. దీనికి కొద్దిగా కుంట నీరు కలపాలి.. కొన్ని రోజుల తరవాత అందులో అనేక పేరామీషియమ్ లు కనిపిస్తాయి.
1.3 స్వరూపం
ఈ సూక్ష్మ జీవి, పొడవుగా 0.15 నుంచి 0.3 మి.మీ. పొడవుంటుంది. ఇది కాలిచెప్పు ఆకారంలో, సిగార్ ఆకారంలో లేదా కండె ఆకారంలో సాధారణంగా స్థిరంగా, అసౌష్ఠవంగా ఉంటుంది. శరీరం పొడవుగా సాగి, పూర్వ భాగంలో మొండిగా, గుండ్రంగా, పరాంతం కొద్దిగా మొనదేలి ఉంటుంది. శరీరాన్ని ముఖ లేదా ఉదర తలం, ప్రతిముఖ లేదా పృష్ఠ తలంగా గుర్తించవచ్చు.
(ఎ) నోటిగాడి (Oral groove) : శరీర ఉదర తలంలో స్పష్టమైన అవనమ, తక్కువ లోతైన గుంత నోటిగాడి ఉంటుంది. ఇది శరీరం మధ్య నుంచి ఉద్భవించి పూర్వభాగం ఎడమ వైపుకు పొడిగించబడి ఉంటుంది.
(బి) పెలికిల్ (Pellicle) : పేరామీషియమ్ లో బాహ్యంగా జీవమున్న తేట, దృఢమైన, స్థితిస్థాపక పెలికిల్ త్వచం ఉంటుంది. సూక్ష్మదర్శినిలో అధిక అధికరణ (magnification)లో చూసినప్పుడు పెలికిల్ షడ్భుజాకార లేదా బహుభుజాకార గుంటలు వాటి పెరిగిన అంచులతో కనిపిస్తుంది. ప్రతీ షడ్భుజ గదికి గల రంధ్రం ద్వారా ఒక శైలిక బయటికి పొడుచుకొంటుంది.
శైలికలు : శరీర ఉపరితలమంతా చిన్న, అనేక, వెంట్రుకల్లాంటి బయటికి పొడుచుకొన్న శైలికలు ఉంటాయి. శైలికలు 10-12 | పొడవుగా 0.27 1 డయామీటర్ పరిమాణంతో ఉంటాయి. ప్రతీ శైలిక పెలిక లో గల షడ్భుజాకార గుంతల రంధ్రం నుంచి పొడుచుకొని ఉంటుంది. మొత్తం శరీరం పై 10,000 నుంచి 14,000 శైలికలుంటాయి. శైలికలు శరీరం పై ఆయత వరసల్లో అమరి ఉంటాయి. శైలికలన్నీ ఒకే పొడవుంటాయి. కొన్ని శైలికలు పరాంత గుచ్ఛాన్ని (caudal tuft) ఏర్పరచినవి కొద్దిగా పొడవుంటాయి.
ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు శైలిక నిర్మాణం కశాభాన్ని పోలి ఉంటుంది. దీనిలో ద్రవరూప మాత్రిక (matrix)ను ఆవరించి త్వచతొడుగుంటుంది. ఇది కణత్వచంతో కలిసి ఉంటుంది. మాత్రికలో తొమ్మిది ఆయత తంతువులు పరిధీయంగా శైలిక పొడవునా అమరి ఉంటాయి. ప్రతీ తంతువు రెండు ఉపతంతువులతో ఏర్పడగా ఒకటి ద్వంద్వ వరసలను (పొట్టి భుజాలు) కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే దిశలో అమరి ఉంటాయి. మాత్రిక కేంద్రస్థానంలో రెండు ఏక తంతువులు లోపలి త్వచంతో ఆవరించి ఉంటాయి. పరిధీయ, కేంద్ర తంతువులకు మధ్య తొమ్మిది అనుబంధ (accessory) తంతువులుంటాయి.
(డి) జీవ పదార్థం : పెలికిల్ లోపల జీవపదార్థం రెండు భాగాలుగా ఉంటుంది. ఇరుకైన, పరిధీయ, స్వచ్ఛమైన, చిక్కని బాహ్య జీవపదార్థం, మధ్యలో గల రేణువులతో ఎక్కువ మొత్తంలో గల అంతర్జీవ పదార్థాలు. బాహ్య జీవ పదార్థంలో ఇన్ ఫ్రాసీలియరీ వ్యవస్థ (infraciliary system), దంశాభకాలు (trichocysts) ఉంటాయి. అంతర్జీవ పదార్థంలో మైటోకాండ్రియా, గాలి సంక్లిష్టం, రైబోజోములు, కణికలు, ఆహార నిల్వ రేణువులు,కేంద్రకం, సంకోచరిక్తికలుంటాయి.
నిమ్న శైలికామయ వ్యవస్థ (Infraciliary system)
ఇది ఆధార కణికలు, కైనెటోడెస్మాటాలతో ఏర్పడింది.
(ఎ) ఆధార కణికలు : ప్రతి శైలిక ఆధారం గొట్టంలా ఉంటుంది. ఇది పరిధీయ తంతువుల ఆధారాలు మందమై ఏర్పడతాయి. వీటినే ఆధార కణికలు లేదా కైనెటోజోమ్ అంటారు. ఆధార కణికలో తొమ్మిది ట్రిప్లెట్ల ఉపతంతువులుంటాయి. ఆధార కణికలు స్వయం ద్విగుణీకరణం (self-duplication)తో ఉండి శైలికలను ఉత్పత్తి చేస్తాయి. ఇది (centriole) లేదా దాని ఉత్పన్నమే (derivative).
(బి ). తారవత్కేంద్రం ) కైనెటోడెస్మాట (Kinetodesmata) : ఈ తంతువులు ఆధార కణికలతో కలిసిపోయి ఉంటాయి. ప్రతీ తంతువు లేదా కైనెటోడెస్మాటాలు శైలిక ఆధార కణిక లేదా కైనెటోజోమ్ నుంచి ఏర్పడి పూర్వ భాగం ప్రయాణించి పరాంత కైనెటోజోమ్ నుంచి ఏర్పడిన, దానిలాంటి ఇంకో నిర్మాణంతో కలుస్తుంది. ఈ విధంగా ఒకదానిపై ఒకటి పడి ఆయత తంతువుల కట్టలు కైనెటోడెస్మాటాను ఏర్పరుస్తాయి. ప్రతీ కైనెటోడెస్మాలో ఐదు తంతువులుంటాయి. ఆయత వరసల కైనెటోసోమ్ వాటి కైనెటోడెస్మాటాలతో ఒక నిర్మాణ ప్రమాణం కైనిటి (kinety)ని ఏర్పరుస్తుంది. ఈ లక్షణం సీలియేటాల ప్రత్యేకత. ఒక కైనెట్ సెట్టు (set) నోరు లేదా నోటిగాడిని ఏర్పరుస్తుంది.
(సి) ట్రైకోసిస్టు (Trichocysts) : ఇవి ఆధార నిర్మాణాలతో ఏకాంతరంగా బాహ్య జీవపదార్థంలో శరీర ఉపరితలానికి కుడి కోణంలో అమరిఉన్న కడ్డీ వంటి లేదా అండాకార దేహాలు. ఇవి పరిమాణంలో చిన్నగా, 4 మైక్రాన్ల పొడవుంటాయి. ప్రతి దేహం పొడవైన కాండం, మొనదేలిన చివరతో ఉంటుంది. చివరి భాగాన్ని స్పైక్ లేదా బార్చ్ (spike or barb) అంటారు. దీన్ని కప్పి ఒక టోపి ఉంటుంది. కాండంలో చిక్కటి టైకినిన్ (trichinin) అనే మాంసకృత్తులుంటాయి. విడుదలైన ట్రైకోసిస్టులు జీవికి లంగరు (anchor) వేయడానికి తోడ్పడతాయి. ట్రైకోసిస్టుల విడుదలకు రసాయనిక, లేదా యాంత్రిక లేదా విద్యుత్తు ప్రేరణలు తోడ్పడతాయి. పూర్తిగా విడుదలైన ట్రైకోసిస్ట్ కాండం పొడవుగా, అడ్డు చారలతో 404 పొడవుంటుంది.
(డి)కేంద్రకం : ఇది హెటిరోకారియోటిక్ (hetero karyotic) అంటే రెండు కేంద్రకాలుంటాయి. అవి ఒక స్థూల, ఒక సూక్ష్మ కేంద్రకం. స్థూల కేంద్రకం మూత్రపిండాకారంలో, సరిగా కనిపించని కేంద్రక త్వచంతో ఉంటుంది. ఇది పాలిప్లాయిడ్,
(poly ploid) అనేక న్యూకియోలైలు (nucleoli),అధిక DNAతో ఉంటుంది. స్థూల కేంద్రకం శాఖీయ, ద్వయ స్థితికమైనది, కణంలో జీవక్రియలను నియంత్రిస్తుంది. ఇది సూక్ష్మ కేంద్రకం నుంచి ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడుతుంది.
సూక్ష్మ కేంద్రకం చిన్నగా, గుండ్రంగా, కేంద్రక త్వచంతో స్థూల కేంద్రకంలో గల ఒక గుంతలో ఉంటుంది. దీనిలో కచ్చితమైన సంఖ్యలో క్రోమోజోములుంటాయి. కేంద్రకాంశం లేదు. ఈ కేంద్రకం ప్రత్యుత్పత్తిని నిర్వహిస్తుంది.
(ఇ) సంకోచరిక్తిక : రెండు రిక్తికలు స్థిర స్థానాల్లో, ఒకటి పూర్వాంతానికి, ఇంకొకటి పరాంతానికి దగ్గరగా పృష్ఠతలం పై ఉంటాయి. ప్రతి గిత్తిక చుట్టు 6-10 పొడవైన, సన్నటి, కండె ఆకారపు కిరణకుల్యలుంటాయి. ఇవి ద్రవాభిసరణ క్రమతకు తోడ్పడే నిర్మాణాలు. ఇవి వేర్వేరు సమయాల్లో సంకోచిస్తాయి. ఇవి తాత్కాలిక నిర్మాణాలు. వీటిలో నీరు పూర్తిగా నిండుకున్నా అవి వాటి గుర్తింపును కోల్పోవు.
(ఎఫ్) ఆహారరిక్తికలు : ఇవి సంకోచించని, నిర్మాణాలు. ఇవి అనేకం. ఇందులో ఆహార పదార్థం ఒక చుక్క నీటిలో మునిగి ఉంటుంది. ఇవి జీవపదార్థంతో పాటు ఒక క్రమ పద్ధతిలో తిరుగుతాయి. దాన్ని సైక్లాసిస్ (cyclosis) అంటారు. మింగిన ఆహార పరిమాణాన్ని బట్టి రిక్తిక ఆకారం, పరిమాణం ఆధారపడుతుంది.
(జి) పరిముఖం : ఉదరతలంలో పూర్వాంతానికి కొద్దిగా అవనమంగా అళిందం (vestibule) ఏర్పడి నోటిగాడి లేదా ఆస్యకుహరం లేదా పరిముఖంలోకి దారి తీస్తుంది. ఈ నిర్మాణం శరీరం మధ్య నుంచి కొద్దిగా పరాంతం దిశగా సాగుతుంది. ఆస్యకుహరం ఇరుకైన కణగ్రసనిలోకి ఇరుకైన రంధ్రం కణముఖం (cytostome) ద్వారా తెరుచుకొంటుంది. పరిముఖంలో సంయుక్త శైలికాంగాలుండి అళిందంతో విభేదనాన్ని కలిగి ఉంటుంది. ఆస్యకుహరం కుడి భాగంలో శైలికల వరసలు ఎండోరల్ త్వచాన్ని (endoral membrane) ఏర్పరుస్తాయి. ఎడమ వైపు మూడు గుంపులుగా నాలుగు వరసల శైలికలు ఆస్యకుహరం ప్రారంభం నుంచి పరాంతం వైపు అమరి ఉంటాయి. ఇవి ఉదర పెనిక్యులస్, పృష్ఠ పెనిక్యులస్ (peniculus), క్వాడ్రులన్లు. ఈ శైలికల వరుసలు త్వచాలను ఏర్పరుస్తాయి. ఎండోరల్ త్వచం నుంచి కణముఖం దిశగా రిబ్బన్ పెలికిల్ ఏర్పడుతుంది. నీ మాడెస్మల్ (nemadesmal) తంతువులు రిబ్బన్ లాంటి పెలికిలకు పృష్ఠంగా ప్రయాణించి పర-ముఖ (postoral) తంతువులుగా పొడుగించబడతాయి. ఇవి కణగ్రసని చుట్టూ ఉంటాయి. అళిందం కుడ్యానికి సాధారణ శైలికల వరసలుంటాయి.
(హెచ్) కణపాయువు (Cytopyge) : కణముఖానికి కొంచెం దిగువన పరాంతానికి దగ్గరగా కణపాయువు ఉంటుంది. దీన్ని సైటోప్రాక్ట్ (cytoproct) లేదా పాయువంటారు. ఇది మల విసర్జన (egestion) సమయంలో ఏర్పడే తాత్కాలిక రంధ్రం.
1.4 శరీర ధర్మశాస్త్రం
(ఎ) గమనం
పేరమీషియం ఆకారం నీటిలో వత్తిడి లేకుండా ఈదడానికి తోడ్పడుతుంది. ఈ దడానికి శైలికలు తోడ్పడతాయి. ఇది 1500 లేదా ఎక్కువ u/సెకన్ల వేగంతో చలిస్తుంది.
గమనంలో శైలికల కదలికలు రెండు రకాలు. (i) వేగమైన ఎఫెక్టివ్ స్ట్రోక్ (effective stroke). (ii) నెమ్మది రికవరి స్ట్రోక్ (recovery stroke). ఎఫెక్టివ్ స్ట్రోక్ లేదా వెనుకకు కదిలే బలమైన కదలికలో శైలిక కొద్దిగా బలంగా వంగి తెడ్డులాగా నీటిని నెట్టుతుంది. అందువల్ల శరీరం ముందుకు కదులుతుంది. రికవరీ స్ట్రోక్ లో శైలిక వెంటనే పూర్వ స్థానానికి చేరుకొని ఇంకొక ఎఫెక్టివ్ స్ట్రోక్ కు తయారవుతుంది.
పేరామీషియం అన్ని శైలికలను ఏకకాలంలో, స్వతంత్రంగా కదల్చదు. ఈ కదలికలు అక్షంపై
అలలలాగా పురోగమించే మెటాకోనల్ కదలికలు (metachronal movements). ఆయత వరసలోని శైలికల్లో ప్రత్యేక అలల వంటి కదలికలు పూర్వభాగంలో పుట్టి వెనుకకు పురోగమిస్తాయి. అందువల్ల ఆయత వరసల్లోని శైలికలు దాని వెనుక దాని కంటే ముందుగా కదులుతాయి. అడ్డు వరసల్లో శైలికలు ఏకకాలంలో కదులుతాయి. ముందుకు కదిలేటప్పుడు మెటా.నల్ కదలికలు పరాంతం నుంచి ముందుకు కదులుతాయి. ఈ జంతువు నేరుగా చలించదు. ఇది తుపాకి గుండులా కదలిక అక్షం పై తిరుగుతూ ముందుకు చలిస్తుంది. శైలికలు అవనమంగా కొద్దిగా కుడి వైపు కదలడం వల్ల కదలిక అక్షం పై జంతువు ఎడమవైపు తిరుగుతుంది. అంతే కాకుండా నోటిగాడిలోని శైలికలు అవనమంగా, వేగంగా కదిలి శరీర పూర్వభాగాన్ని ముఖతలం నుంచి దూరంగా తిప్పడం వల్ల వర్తులంగా కదులుతుంది. రెండు కదలికల వల్ల జంతువు కదలిక తిరుగుతూ ముందుకు కదులుతుంది.
(i) ఆహారం : ఈ జాంతవ భక్షక (holozoic) జీవి బాక్టీరియా, ప్రోటోజువా, శైవలాలు, డయాటమ్స్, ఈస్ట్ మొదలయిన వాటిని భక్షిస్తుంది. ఇది చిన్న చిన్న మాంసం, కాయకూరలను కూడా తింటుంది.
(ii) ఆహార సేకరణ : ఆహార సేకరణకు జీవి. ఆహారం దగ్గరకు చలిస్తుంది. కణముఖం ఆహారాన్ని మింగడానికి తోడ్పడుతుంది. శైలికల స్థిర కదలికలు ఆహారాన్ని నీటితో పాటు అళిందం వైపు తరలిస్తాయి. అళిందపు శైలికల గాడులు ఆహారపదార్థాలను ఆస్యకుహరానికి చేరుస్తాయి. జీవి ఎంపిక చేసిన ఆహారాన్ని మాత్రమే ఆస్యకుహరానికి చేర్చుతుంది. మిగిలినవి వదిలివేయబడతాయి. ఆస్యకుహరం శైలికా త్వచాలు ఆహారాన్ని కణముఖం ద్వారా కణగ్రసనికి తరలించగా చివరిలో గల త్వచ ఆశయంలోకి సేకరించిన ఆహారంతో పాటు ఆశయం చిదిమివేయబడి రిక్తికగా మారుతుంది. రిక్తికలు ఆహారం అందుబాటు, సంగ్రహణ రేటు ప్రకారం 1 నుంచి 5 ని||లో ఏర్పడతాయి.
నోటి గాడి ఆహారరేణువులతో నీటి ప్రవాహం ఆళిందం మింగిన చిన్న ఆహార రేణువులు మింగిన పెద్ద ఆహార రిక్తికలు ఆస్యకుహరం వదిలే మార్గం ఎంపికమార్గం శైలికామయ పట్టీలు కణముఖం ఏర్పడుతున్న శైలికలు ఆహారాన్ని నోటిగాడి లోనికి తరలించే
1.15 పేరమీషియం – పోషణ
జీర్ణక్రియ
కణగ్రసనిలో తయారైన రిక్తికలో ఆహారంతో పాటు పలుచటి నీటిపొర ఉంటుంది. రిక్తికలు స్థిర కక్ష్యలో జీవపదార్థ కదలికలతో తిరుగుతాయి. దీన్ని సైక్లాసిస్ (cyclosis) అంటారు. జీవపదార్థంలో అనేక రిక్తికలు తిరుగాడుతుంటాయి. రిక్తికలు మొదట పరాంతం వైపు,
(బి) పోషణ
నోటిగాడి పూర్వాంతం నుంచి ప్రతిముఖతలంలో తిరుగుతాయి. తిరిగి ముఖతలం ద్వారా పరాంతాన్ని చేరి కణపాయువు దిశగా కదులుతాయి. సైక్లాసిస్ (ఆహార రిక్తికల భ్రమణం)లో పూర్తి స్థాయి జీర్ణక్రియ జరుగుతుంది. ప్రోటియేజెస్, కార్బోహైడ్రేజెస్, ఎస్టరేజెస్ (esterases) అనే జీర్ణ ఎంజైములు ఆహార రిక్తికలోకి విడుదలవుతాయి. ఆహారం క్షార, ఆమ్ల మళ్ళీ క్షార మాధ్యమాల్లో జీర్ణమవుతుంది. జీర్ణమైన ఆహారం వ్యాపనం ద్వారా జీవపదార్థంలోకి గ్రహించబడుతుంది. (iv) విసర్జన
జీర్ణక్రియ, శోషణ కొనసాగే కొద్దీ ఆహార రిక్తిక పరిమాణం నెమ్మది నెమ్మదిగా తగ్గి చివరికి చిన్నదవుతుంది. జీర్ణం కాని ఆహారంతో పాటుగా రిక్తిక కణపాయువు ద్వారా విసర్జించబడుతుంది.
(సి) శ్వాసక్రియ
శ్వాసక్రియ సాధారణ వ్యాపనం ద్వారా జరుగుతుంది. ఇందులో నీటిలోని ఆక్సిజన్ జీవపదార్థంలోకి ప్రవేశిస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్, నత్రజని వ్యర్థాలు జీవపదార్థం నుంచి బయటికి తరలించబడతాయి.
(డి) ద్రవాభిసరణ క్రమత
ఇది రెండు సంకోచ రిక్తికల ద్వారా నిర్వహించబడుతుంది. జీవ పదార్థం సాంద్రత బాహ్యపరిసర నీటి కంటే ఎక్కువ కాబట్టి ఎండోఆస్మాసిస్ (endosmosis) ద్వారా నీరు శరీరంలోకి నిరంతరం చేరుతుంది. ఆహారం ద్వారా కొద్ది పాళ్ళలో కూడా నీరు లోనికి చేరుతుంది. ఈ నీరు క్రమ సంకోచ వ్యాకోచాల ద్వారా సంకోచరిక్తికలతో బయటికి పంపబడుతుంది. దీనికి కిరణ కుల్యలు తోడ్పడతాయి. రిక్తికలు బాహ్య జీవపదార్థం లోపలి భాగంతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి పెలికిలను చొచ్చుకొనే స్థిర కుల్యల ద్వారా ఖాళీ అవుతాయి. రిక్తికలోకి నీరు చేరే కొద్దీ పరిమాణం పెరిగి, పూర్తిస్థాయిలో మారిన తరవాత సంకోచరిక్తిక రంధ్రం ద్వారా నీటిని బయటకి విడుదల చేస్తుంది. రెండు సంకోచరిక్తికలు ఏకాంతరంగా సంకోచిస్తాయి. ప్రతి రెండు సంకోచాలకు మధ్య 10 – 20 సెకన్ల వ్యవధి ఉంటుంది. పూర్వ రిక్తిక కంటే పరరిక్తిక వేగంగా సంకోచిస్తుంది. ఎందుకంటే కణగ్రసని నుంచి నీరు ఎక్కువగా పర సంకోచరిక్తికను చేరడమే.
నీటి పూర్తి విస్సారంలో ఈ కుల్యలు స్థిరం కావు. రిక్తిక నీటిని పంపుతున్న కొద్దీ కుల్యల బయటి భాగాలు లోనికి వచ్చే వల్ల వెడల్పు అవుతాయి. వెడల్పయిన వాటిని ఆంపుల్లాలు (ampullae) అంటారు. ఈ ఆంపుల్లాలు ఇంజక్షన్ కుల్యల ద్వారా నీటిని కొత్తగా ఏర్పడుతున్న సంకోచరిక్తిక లోకి పంపుతాయి. కిరణకుల్యల చుట్టూ చిక్కగా రేణువులుంటాయని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అధ్యయనాలు తెలుపుతున్నాయి. పిడర్ (Schneider) (1960) కుల్యలు, ఆంపుల్లాల చుట్టూ అనేక చిన్న నాళికలు అంతర్జీవ ద్రవ్యజాలకంతో కూడి ఉంటాయని తెలిపాడు. అంతర్జీవ ద్రవ్యజాలకం నీటిని సేకరించి వృక్క నాళికలలోనికి చేర్చగా, తిరిగి ఆ నీరు వృక్క కుల్యలు, ఆంపుల్లాలో చేరుతుంది. ఆంపుల్లాల నుంచి రిక్తికలోనికి నీరు చేరగా అది నీటిని బయటికి విసర్జిస్తుంది.
పేరమీషియంలో గల కుల్యావ్యవస్థ నీటిని సంకోచ రిక్తికలోకి పంపిస్తుంది.
(2) ప్రవర్తన
పేరమీషియం వివిధ ప్రేరణలకు వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంది. బాహ్య పరిసరాల ప్రేరణకు జరిపే చర్యను ప్రవర్తన అంటారు. పేరమీషియం కాంతి, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ సాంద్రతకు, CO, కు, రసాయనాలకు, నీటి అలలకు వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంది. జంతువు ప్రేరణకు దగ్గరగా వెళ్ళడాన్ని
ధనాత్మక ప్రవర్తన అని, దూరంగా ఉండటం ఋణాత్మక ప్రవర్తన అని అంటారు.
2. ఉష్ణోగ్రత : ఉష్ణోగ్రతకు చూపే ప్రవర్తనను థర్మోటాక్సిస్ (thermolaxis) అంటారు. పేరమీషియం 24 – 28°C ఉష్ణోగ్రతలో సుఖంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత కంటే ఎక్కువైనప్పుడు జంతువు దూరంగా కదులుతుంది.
3. కాంతి : కాంతికి చూపే ప్రవర్తనను ఫోటోటాక్సిస్ (phototaxis) అంటారు. ఎక్కువ కాంతికి, UV కాంతికి ఋణాత్మక ప్రవర్తన చూపెడుతుంది.
4. రసాయనాలు : రసాయనాలకు చూపే ప్రవర్తనను కీమోటాక్సిస్ (chaemotaxis) అంటారు. దీనికి ఋణాత్మక ప్రవర్తన. బలహీన లవణ ద్రావణానికి ఋణాత్మక ప్రవర్తన చూపగా ఒక చుక్క బలహీన ఆమ్లం కలిపినప్పుడు ప్రవర్తన వెంటనే ధనాత్మకంగా మారుతుంది.
5. నీటి ప్రవాహం (water current) : నీటి ప్రవాహానికి చూపే ప్రవర్తనను రియోటాక్సిస్ (rheotaxis) అంటారు. జీవి నీటి ప్రవాహాంతో పాటు చలిస్తుంది.
6. విద్యుత్ ప్రవాహం : విద్యుత్ ప్రవాహానికి చూపే ప్రవర్తనను గాల్వనోటాక్సిస్ (Galvano taxis) అంటారు. పేరమీషియం చాలా తక్కువ విద్యుత్ ప్రవాహమున్న వైపు కదులుతుంది. ప్రవాహం ఎక్కువున్నప్పుడు ఏనోడ్ (anode) వైపు కదలడం, చనిపోవడం జరుగుతుంది.
7. భూమ్యాకర్షణ (Gravity) : భూమ్యాకర్షణకు చూపే ప్రవర్తనను జియోటాక్సిస్ (Geotaxis) అంటారు. పేరమీషియం దీనికి ఋణాత్మకం. జీవి సాధారణంగా పైకి కదిలి ఉపరితలం దగ్గరగా గుమిగూడుతుంది. పేరమీషియంను తిరగవేసిన ‘U’ గొట్టంలో వేసి మూసినప్పుడు వెంటనే పైకి కదులుతుంది. పేరమీషియం ఏదైనా దృఢమైన వస్తువును తాకినప్పుడు కొద్దిగా వెనకకు జరిగి మళ్ళీ ఇంకో కోణంలో ముందుకు కదులుతుంది. తిరిగి మళ్ళీ దృఢ వస్తువును తాకితే ఋణాత్మక ప్రవర్తనను చూపుతుంది. ఇది పరిస్థితులు అనుకూలించే వరకు అలాగే ఉంటుంది. పేరమీషియం ట్రయల్, ఎర్రర్ (trial and error) పద్ధతిలో నేర్చుకొంటుంది.
(ఎఫ్) ప్రత్యుత్పత్తి
అలైంగిక ప్రత్యుత్పత్తి అడ్డు ద్విధా విచ్ఛిత్తి ద్వారా, కేంద్రక పునర్వ్యవస్థీకరణలు, సంయుగ్మం, ఎండోమిక్సిస్ (endomixis), ఆత్మ సంపర్కం (autogamy) ద్వారా జరుగుతుంది. ప్రతికూల పరిస్థితులలో పేరమీషియం కోశీ భవనం చెందుతుంది.
(i) ద్విధా విచ్ఛిత్తి
అనుకూల పరిస్థితులలో జీవి అలైంగికంగా అడ్డంగా రెండు పిల్ల కణాలుగా విభజింపబడుతుంది. విభజనకు కొద్ది ముందుగా జీవి ఆహారం తీసుకోవడం ఆపివేసి కండెఆకారంలోకి మారి చురుకుదనాన్ని ప్రదర్శించదు. సూక్ష్మ కేంద్రకం స్థూల కేంద్రకంలోని తన స్థానం నుంచి కదిలి క్లిష్టమైన సమవిభజనను (mitosis) ప్రారంభిస్తుంది. ఈ కేంద్రకం కొద్దిగా జరగడానికి 30 ని|I, రెండు పిల్ల జీవులు విడిపోవడానికి 1-2 గం|| సమయం పడుతుంది. ఈ విభజన పరిస్థితులను బట్టి రోజుకు 2 – 3 సార్లు జరుగుతుంది. ఏర్పడిన రెండు పిల్ల జీవులలో పూర్వ భాగంలోని జీవిని ప్రొటర్ (proter) అనీ పరభాగంలోని జీవిని ఒపిస్ట్ (opisthe) అనీ అంటారు. ఇవి ఒకే పేరమీషియం నుంచి ఏర్పడటం వల్ల జన్యు పరంగా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి వీటిని క్లోన్స్ (clones) అంటారు.
పరిమాణాన్ని పెంచుకోవడం, క్రోమోజోములు నెమ్మదిగా కనిపించడం (జాతిని బట్టి 36 – 150 సంఖ్య ఉంటాయి) ప్రారంభమవుతుంది. విభజన చివరి ఘట్టానికి కొనసాగగా సూక్ష్మ కేంద్రకం బాగా పొడవుగా సాగి రెండు చివరలు రెండు పిల్ల కేంద్రకాలుగా మారి విడిపోతాయి. ఇంకో వైపు స్థూల కేంద్రకం ఎమైటాటిక్ (amitotic) సరళ పద్ధతిలో పొడవుగా సాగి మధ్యలో విభజన గాడిని ఏర్పరుస్తుంది (ఇందులో క్రోమోజోములు పాల్గొనవు). స్థూల కేంద్రకం అధిక బహుళ స్థితికమని (polyploid), ఎక్కువసార్లు ఎండోమైటాసిస్ (endomitosis) వల్ల అనేక జీనోమ్ (genomes)లను కలిగి ఉంటుందని భావన కలదు. ఇక జీవిలో, రెండు కణగాడులు (ఒకటి పూర్వ అర్ధ భాగంలో ఇంకొకటి పర అర్ధ భాగంలో) ఏర్పడటం ప్రారంభమవుతుంది. రెండు సంకోచరిక్తికలు (నిజ ప్రతులు-original) ఒకటి పూర్వ భాగంలో ఇంకోటి పరభాగంలో ఉంటాయి. తరవాత దశలలో ఒకటి పూర్వ ఇంకొకటి పరరిక్తికలు ఏర్పడతాయి. కొత్త ఆస్య నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ క్రియలు జరుగుతున్న సమయంలో శరీర ఆయత వ్యాసంలో ఒక విభజన గాడి ప్రారంభమవుతుంది. ఇది లోతుగా కొనసాగి రెండు పిల్ల కణాలను వేరు చేస్తుంది.
