Army Public School Recruitment| PGT, TGT, TRT, PET, Clerk | Last date 10.10.2023

Army Public school recruitment 

హైదరాబాద్లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ వివిధ టీచింగ్, నాన్టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఆఫ్లైన్ విధానంలో దరస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకోవా. దరఖాస్తు నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు జతచేసి నిర్ణీతగడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించవచ్చు

👉పూర్తి వివరాల PDF కోసం కింద క్లిక్ చేయండి 👇👇
మొత్తం ఖాళీలు: 18
1) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 02 పోస్టులు
సబ్జెక్టులు: ఇంగ్లిష్, జియోగ్రఫీ.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు 50 శాతం మార్కులతో డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఉండాలి.
2) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 05 పోస్టులు
సబ్జెక్టులు: ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్.
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు 50 శాతం మార్కులతో డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ ఉండాలి.
3) ప్రైమరీ టీచర్ (పీఆర్టీ): 02 పోస్టులు
సబ్జెక్టులు: అన్ని సబ్జెక్టులకు
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు 50 శాతం మార్కులతో డీఈఈడీ/బీఈడీ ఉండాలి.
4) అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ): 01 పోస్టులు
అర్హత: ఎక్స్-సర్వీసెమెన్ ర్యాంకులో జేసీవో క్లర్క్ స్థాయి వరకు ఉండాలి. కంప్యూటర్, అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాలు.
5) లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ): 01 పోస్టులు
అర్హత: ఎక్స్-సర్వీసెమెన్ ర్యాంకులో హవాల్దార్ క్లర్క్ స్థాయి వరకు ఉండాలి. డిగ్రీతోపాటు కంప్యూటర్, అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాలు.
6) కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్: 01 పోస్టులు
అర్హత: ఇంటర్ అర్హత ఉండాలి. ఏడాది డిప్లొమా(కంప్యూటర్ సైన్స్) కోర్సుతోపాటు హార్డ్ వేర్, నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి.
7) సైన్స్ ల్యాబ్ అటెండెంట్: 03 పోస్టులు.
అర్హత: ఇంటర్(సైన్స్) అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
అనుభవం: 5 సంవత్సరాలు.
8) మల్టీటాస్కింగ్ స్టాఫ్: 02 పోస్టులు
అర్హత: పదోతరగతి అర్హతతోపాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి. 
9) గార్డెనర్: 01 పోస్టులు
అర్హత: పదోతరగతి అర్హతతోపాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. దరఖాస్తుకు విద్యార్హతకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జతచేసి పంపాలి.
ఎంపిక విధానం: అనుభవం ఆధారంగా.
చిరునామా:
Army Public School Golconda Hydersha kote, Near Suncity, Hyderabad-500031.
దరఖాస్తు చివరితేది: 10.10.2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page