అంతర్జీవ ద్రవ్య జాలకం (Endoplasmic Reticulum) : ఉనికి – స్వరూప లక్షణాలు, విధులు, ఉద్భవం
1. అంతర్జీవ ద్రవ్య జాలకం (Endoplasmic Reticulum) ఉనికి – స్వరూప లక్షణాలు కణాంతర్భాగంలో కణ పదార్థం ఉంటుంది. ఇది కణం నిండా ఆయతనంగా (Bulk) ఉండే సాక్షిక పారదర్శక (Translucent), సమజాత (Homogeneous), కాంజికాభ (Colloidal) పదార్థం. ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శిని సహాయంతో దీన్ని పరిశీలించినప్పుడు దీనిలో ఒక జటిల త్వచాగమనం (Complex membranous labyrinth) కనిపిస్తుంది. దీన్నే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం (ER) అంటారు. మిగిలిన జల ద్రావణాన్ని హయలో ప్లాసం (Hyaloplasm) అంటారు. కణ…