పొరిఫెరా అనే పురాతన జీవులను 18వ శతాబ్దం వరకు జంతువులుగా పరిగణించలేదు. ఎల్లిస్ (Ellis) 1765 సం||లో ఈ జీవుల ఆస్కులమ్ స్పందించగలదనీ, వీటి శరీరంలోకి నీరు (ప్రవహిస్తుందని గుర్తించాడు. తరవాత లిన్నేయస్, లామార్క్, క్యువియర్ అనేవారు వీటిని జూ సైటాలో చేర్చారు. గ్రాంట్ 1836 సం||లో వీటికి పోరి ఫెరా సమూహంగా గుర్తింపు ఇచ్చాడు.
ఇవి ఎక్కువగా సముద్రాలలో, కొన్ని మంచి నీటిలో జీవిస్తాయి. ఇందులో అతి పెద్ద స్పంజిక స్ఫెసియోస్పాంజియా వెస్ఫేరియం 31/2 అడుగులు పొడవుగాను, అతి చిన్న స్పంజిక ల్యూకోసోలీనియా బ్లాంకా కేవలం అంగుళంలో 0.11 భాగం పొడవుగాను, పొటిరియన్ పటేరి నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది. స్పంజికలు 18,500 అడుగులు లోతులో కూడా నివసిస్తాయి. స్పంజికలను గురించి చదివే శాస్త్రాన్ని పారాజువాలజీ అంటారు.
2.సామాన్య లక్షణాలు
1. జీవులలో కణాల సంఖ్య అధికంగా ఉంటుంది. కానీ కణజాల వ్యవస్థ ఏర్పడలేదు. ఈ కణాలే అన్ని జీవక్రియలను నిర్వహిస్తాయి. స్పంజికల దేహవ్యవస్థలో కణ విచ్ఛేదనం, కణాల మధ్య క్రియాత్మకమైన శ్రమ విభజన కనిపిస్తుంది. ఒక కణానికి, ఇంకొక కణానికి దాదాపుగా సంబంధం ఉండదు. వీటిలో అవయవాలు లేవు.
2. ఇవి ఏకాంత సహనివేశ జీవులు, స్థాన బద్ధ జీవులు. నీటిలో గల రాళ్ళకు లేదా కర్పరాలకు లేదా కర్ర ముక్కలకు అంటుకొని జీవిస్తాయి.
3. దేహం పూలసజ్జలాగా, స్తూపాకారంగా, నాళం ఆకారంలో కుషన్ మొదలయిన ఆకారాల్లో ఉంటుంది.
4. స్పంజకలు వలయ సౌష్ఠవంతో లేదా సౌష్ఠవ రహితంగా ఉంటాయి.
5. జీవులు వివిధ రంగులలో ఉంటాయి. ఇవి బూడిద, లేత గోధుమ, కాంతివంతమైన పసుపు, ఎరుపు, నారింజ రంగుల్లోను, కొన్ని పింక్ లేదా వయలెట్ రంగు చారలతోనూ కొన్ని నలుపు లేదా తెలుపుగానూ ఉంటాయి. కొన్ని స్పంజికలలో సహజీవన శైవలాలు ఉండటం వల్ల అవి పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
6. వీటిలో ద్విస్తరిత శరీర కుడ్యం ఉంటుంది. దేహం వెలుపల పినాకోడర్మ్, లోపల కొయనోడర్న్, మధ్యస్థంగా కణరహిత జిగురు వంటి మధ్య భ్రూణ కణజాలం ఉంటాయి. ఈ మధ్యస్థ పొరలో అస్థిపంజర నిర్మాణాలు, స్వేచ్ఛాయుత అమీబాయిడ్ కణాలు ఉంటాయి.
7. శరీర ఉపరితలంలో అనేక చిన్న చిన్న ఉచ్ఛ్వాస రంధ్రాలు లేదా కుల్యా ముఖాలు లేదా ఆస్టియా ఉంటాయి. కొన్ని పెద్ద నిశ్వాస రంధ్రాలు లేదా ఆస్కులం అనేవి నీటిని వెలుపలికి పంపించడంలో తోడ్పడతాయి.
8. స్పంజికల శరీర కుడ్యంలో అనేక కాలువలుంటాయి. ఈ కాలువలన్నీ దేహాంతర్భాగంలో గల పరిజఠర కుహరం లేదా జఠరాభ కుహరిక లోకి తెరుచుకొంటాయి. ఈ పెద్ద కుహరం ఆస్కులం ద్వారా వెలుపలికి తెరుచుకొంటుంది.
9. స్పంజిక వ్యాసార్ధ రేఖల పై కొన్ని ప్రత్యేక గోళాకార గదులుంటాయి. వాటిలో కశాభయుతమైన కాలర్ కణాలు లేదా కొయనోసైట్ కణాలుంటాయి. అందువల్ల వీటిని ప్లాజెల్లేటెడ్ గదులు లేదా రేడియల్ గదులు అని అంటారు. ఆహార రేణువులు, ఆక్సిజన్, నీరు ఆస్టియా ద్వారా లోనికి ప్రవేశిస్తాయి. అవి ప్లాజెల్లీడ్ గదులను చేరగానే అక్కడి కణాల కళాభాల వల్ల జల ప్రవాహం, ఆస్కులం దిశగా తిరుగుతుంది. 10. అస్థిపంజరం కాల్కేరియస్ లేదా సిలీషియస్ కంటకాలు లేదా స్పంజికా తంతువులు
లేదా రెండింటిని కలిగి ఉంటుంది. కొన్నింటిలో అస్థిపంజరం ఉండదు. దీన్ని అమీబోసైట్ కణాలు స్రవిస్తాయి.
11. ఇవి జాంతవ భక్షక జీవులు. కణాంతస్థ జీర్ణక్రియ జరుగుతుంది. ఈ జీవులలో శ్వాసావయవాలు, విసర్జక అవయవాలు, ఉపాంగాలు, చలించే అవయవాలు లేవు. వీటిలో శ్వాసక్రియ, విసర్జన క్రియ వ్యాపనం ద్వారా జరుగుతాయి.
12. ఈ జీవులలో ప్రాథమిక నాడీ వ్యవస్థ కనిపిస్తుంది. ద్వి ధ్రువ లేదా బహు ధ్రువ నాడీ కణాలు కలిసి ఏర్పరచిన ఒక వల వంటి నిర్మాణం కొన్ని స్పంజికలలో ఉంటుంది.
13. స్పంజికలన్నీ ఉభయ లైంగిక జీవులైనా పర ఫలదీకరణ జరుగుతుంది.
14. అలైంగిక ప్రత్యుత్పత్తి మొగ్గలు లేదా జెమ్యూల్స్ వల్ల జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో అండాలు, శుక్రకణాలు అమీబోసైట్స్ నుంచి ఏర్పడతాయి.
15. ఈ జీవులలో పూర్ణ భంజిత విదళనం జరుగుతుంది. అభివృద్ధిలో స్వేచ్ఛగా ఈదే ఆంఫిబ్లాస్టులా లేదా పరంకైములా అనే శైలికామయ డింభకాలు ఏర్పడతాయి.
16. ప్రాథమిక జననస్తరాలు – బాహ్య త్వచం, అంత: స్వచం నిర్దిష్టంగా కనిపించవు. 17. పునరుత్పత్తి స్పంజికలలో అత్యధికంగా కనిపిస్తుంది.
18. ఈ స్పంజికలు ఆర్కెటిక్ మండలం నుంచి ఉష్ణ మండలం వరకు వ్యాపించి ఉంటాయి. 2.3 వర్గీకరణ
స్పంజికలలో అస్థిపంజరాన్ని ఆధారంగా చేసుకొని ఈ వర్గాన్ని మొత్తం మూడు విభాగాలుగా విభజించారు. అవి : కాల్కేరియా, హెగ్జాక్టినెల్లిడా, డెమోస్పాంజియా.
విభాగం. 1. కాల్కేరియా
1. ఇవి చిన్న కాల్కేరియస్ స్పంజికలు.
2. వీటి శరీరం 10 సెం.మీ. కంటే ఎక్కువగా పెరగదు. ఇవి సహనివేశాలు లేదా ఏకాంత జీవులుగా నివసిస్తాయి.
3. శరీరం స్తూపాకారం లేదా సజ్జలాగా ఉంటుంది.
4. అస్థిపంజరం కాల్కేరియస్ కంటకాలతో నిర్మితమైనది. కంటకాలు ఒకటి లేదా మూడు లేదా నాలుగు కిరణాలతో విడివిడిగా ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా ఏ రంగు ఉండదు.
5. ఈ జీవులలో ఏస్కనాయిడ్, సైకనాయిడ్, ల్యూకనాయిడ్ కుల్యా వ్యవస్థలలో ఏదైనా ఉండవచ్చు. శరీర పరభాగం ఒక మొదలుతో ఉంటుంది. పూర్వ భాగంలో ఆస్కులం ఉంటుంది.
6. ఇవి కేవలం సముద్రాలలో మాత్రమే నివసిస్తాయి.
ఇందులో హోమోసీలా, హెటిరోసీలా క్రమాలు ఉంటాయి.
ఉదా: ల్యుకోసోలీనియా, క్లాథినా, స్కైఫా, గ్రాన్షియ, ల్యుసిలా.
విభాగం. 2. హెగ్జాక్టినెల్లిగా
1. శరీరం స్థూపాకారంలో వలయ సౌష్ఠవంతో ఉంటుంది. పరభాగం సాధారణంగా ఆధారంతో కూడి ఉంటుంది. కొన్ని జీవులలో ఆధారం కింద పొడుగాటి కంటకాలు వేళ్ళ గుత్తిలాగ ఏర్పడి బురదలో చొచ్చుకొని జీవి నిటారుగా ఉండటానికి తోడ్పడతాయి. వీటిలో కొన్ని జీవులు ఒక మీటరు పొడవుంటాయి.
2. స్పంజికలలో ట్రెయాన్టన్, హెగ్జాక్టిన్, సీలీషియస్ కంటకాలు ఉండవచ్చు. ఈ కంటకాలు విడివిడిగా ఉంటాయి.
3. శరీర కుడ్యం సన్నగా లేదా దళసరిగా ఉండవచ్చు. శరీర పూర్వాంతం ఆస్కులం ద్వారా తెరుచుకొంటుంది. దీన్ని మూయడానికి సిలికా కంటకాలచేత నిర్మితమైన జల్లెడ వంటి మూత ఉంటుంది.
4. అస్థిపంజరం నిర్మాణాన్ని ట్రిబిక్యులార్ వల అంటారు. ఈ వలలో ఉన్న ఖాళీ స్థలంలో బహు కేంద్రక నిర్మాణాలు అధికంగా ఉంటాయి. ఇందులో కారెన్ సైట్, థెసోసైట్, ఆర్కియోసైట్ ఇతర అమీబోసైట్ సమూహాల వల్ల బహుకేంద్రక నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ ఖాళీ స్థలాల్లో కశాభకణాల అరలు ఇమిడి ఉంటాయి.
5. స్పంజికల బాహ్య తలం మీద బాహ్య చర్మం స్పష్టంగా కనిపించదు.
6. స్పంజికలలో స్పందించే క్రియ లేదు. 8. ఈ జీవుల డింభకాన్ని స్టీరియోగాస్టులా అంటారు. 9. .
7. అలైంగిక ప్రత్యుత్పత్తి మొగ్గలు తొడగడం వల్ల జరుగుతుంది.
ఇవి కేవలం సముద్రాలలో ఎక్కువ లోతైన ప్రదేశాలలో నివసిస్తాయి
ఇందులో హెక్టాస్టెరోఫారా, ఎంఫి డిస్కో ఫోరా క్రమాలు ఉంటాయి.
ఉదా: యు ఫ్లెకిల్లా, పొర్నెరా, హయలోనీమా, ఫెరోనిమా,
3. డెమోస్పాంజియా
1. వీటిలో చిన్న, పెద్ద స్పంజికలు ఉంటాయి. ఇవి సహనివేశాలుగా లేదా ఏకాంతంగా నివసిస్తాయి. .
2. అస్థిపంజరం లేదు. ఈ స్పంజికలలో కంటకాలు ఉండవచ్చు లేదా లోపించవచ్చు. ఒక వేళ ఉంటే అవి సిలీషియస్ లేదా స్పాంజిన్ పోగుల రూపంలో ఉంటాయి. కొన్నింటిలో రెండు కలిసి ఉంటాయి.
3. సిలీషియస్ కంటకాలు మోనార్జన్ లేదా ఆరు కిరణాలతో ఉంటాయి. 4. శరీరం సజ్జ లాగా, కుషన్ లాగా ముడతలు పడిన శరీర కుడ్యంతో ఉంటుంది. 5. వీటిలో ల్యూకనాయిడ్ కుల్యా వ్యవస్థ కనిపిస్తుంది. ఈ వ్యవస్థ ఏస్కనాయిడ్ కుల్యా వ్యవస్థ నుంచి కాకుండా రాగన్ అనే కుల్యా వ్యవస్థ నుంచి ఏర్పడుతుందని భావిస్తారు. 6. కొయనోసైట్ కణాలు కేవలం భిన్నమైన గుండ్రటి గదులకు మాత్రమే పరిమితమైనవి. 7. చాలా వరకు సముద్ర జీవులు. కొన్ని మంచి నీటి జీవులు.
ఉపవిభాగం : 1 హెగ్జాక్టినెల్లిగా
1. సిలీషియస్ కంటకాలు ఒక వేళ ఉంటే టెట్రాగ్దాన్ రకానివి.
2. శరీరం బల్ల పరుపుగా లేదా గుండ్రంగా పాలిపోయిన లేదా కాంతివంతమైన రంగులో ఉంటుంది.
3. కొన్నింటిలో పొడుగాటి వేళ్ళ కంటకాలతో అధఃస్థలాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. కొన్నింటిలో వేళ్ళ కంటకాలుండవు.
4. స్పంజికల శరీరం ముళ్ళలాగ గరుకుగా ఉంటుంది.
5. వీటిలో ల్యూకనాయిడ్ కుల్యా వ్యవస్థ ఉంటుంది. సాధారణంగా శరీరం మధ్య స్పంజికా కుహరం ఉండదు.
ఇందులో మిక్సోస్పాంజిడా, కార్నోపా, క్రిస్టిడియా అనే క్రమాలు ఉంటాయి.
ఉదా: ఆస్కరెల్లా, హలసార్క, ప్లాంకినా, హాలీనా, టెథియా, ఆంకోరినా, పెనారిస్. ఉపవిభాగం : 2 మోనార్జినిడా
1. ఈ స్పంజికలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి. ఇవి సముద్రం ఒడ్డున లోతైన ప్రాంతాలలో, కొన్ని మంచినీటిలో కనిపిస్తాయి..
2. వీటిలో మోనార్జాన్, సిలీషియస్ కంటకాలు ఉంటాయి.
3. శరీరం గుండ్రటి ముద్ద లాగా లేదా కొన్ని శాఖలతో పొదలాగా లేదా పొడవుగా ఉండి గరాటు వంటి నిర్మాణంతో ఉంటుంది. కొన్నింటిలో వృంతం కూడా ఉంటుంది. 4. స్పాంజిన్ పోగులు ఉండవచ్చు లేదా లోపించవచ్చు.
ఇందులో హాడ్రోమెరినా, హాలికాన్డిడా, పాసిలోరినా, హాపోస్క్లెరినా అనే క్రమాలు ఉంటాయి.
ఉదా: క్లియోనా, సుబరైటిస్, మైక్రోసియోనా, క్లాడోజా, ఎస్సెరియాప్సిన్.
ఉపవిభాగం : 3 కెరటోసా
1. ఇవి -కొమ్ము స్పంజికలు.
2. వీటిలో కంటకాలుండవు. కానీ స్పంజికా తంతువులు అధికంగా ఉంటాయి.
3. శరీరం సాధారణంగా గుండ్రటి ముద్ద లాగా ముదురు రంగులో ఉంటుంది. 4. వీటిలో స్పష్టంగా కనిపించే ఆస్కులమ్ లు అనేకం ఉంటాయి.
ఉదా: యుస్పాంజియా, హిప్పోస్పాంజియా, ఎఫీసిల్లా, హెక్సిడెల్లా, పిలోస్పాంజియా.