Protozoa – General characteristics And Classification


1.పరిచయం

ఈ సూక్ష్మ జీవుల వర్గాన్ని మొట్ట మొదట లీవెన్ హక్ (Leeuwen Hoek) అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇందులో స్వేచ్ఛా జీవులు, పరాన్న జీవులు ఉంటాయి. కొన్ని జంతువులు నేలలో జీవిస్తాయి. చాలా జీవులు మంచి నీటిలో కూడా కనిపిస్తాయి.

1820లో గోల్డ్ ఫేస్ అనే శాస్త్రవేత్త ఈ ఏకకణ జీవులకు ప్రోటోజువా (ప్రోటస్ = మొదట; జువాన్ = జంతువు) అని నామకరణం చేశాడు. వీటి స్వరూప నిర్మాణ శాస్త్రం 1845లో వాన్ సీబాల్డ్ (Vonsibold) అనే శాస్త్రజ్ఞుడు నిర్వచించాడు. ఇతడు ప్రోటోజువా జీవులను ఏకకణ జీవులని గుర్తించాడు. డోబెల్ (Dobell) అనే శాస్త్రవేత్త ప్రోటోజువన్లను అకణ జీవులని పేర్కొన్నాడు. అందుకు కారణం ఈ జీవులలో దేహం కణాలుగా విభక్తం కాకపోవడమే. అన్ని జీవన వ్యాపారాలను ఈ ఏక కణమే నిర్వహిస్తుంది.

1.1 ప్రత్యేక లక్షణాలు

1. కణాంతస్థ జీవులలో మాత్రమే శ్రమవిభజన కనిపిస్తుంది.

2. మెటాజువా కణం జరిపే శరీర కణ విభజన వంటి సమవిభజనను అలైంగిక ప్రత్యుత్పత్తిలో ప్రదర్శిస్తాయి.

3. జీవసంబంధమైన చర్యలన్నీ ఒకే ఒక కణంలో నిర్వహిస్తాయి. .

4. ఉద్దీపనలకు ఈ జీవులు జరిపే ప్రతి చర్యలు ఉన్నత జీవుల నాడీ వ్యవస్థకు ప్రారంభం అని చెప్పవచ్చు.

5. పేరమీషియమ్ లోని సంయుగ్మకాలు లైంగిక ద్విరూపకతకు నాంది.

1.3 సామాన్య లక్షణాలు

1. సామాన్యమైన ప్రాథమిక జీవులు. సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడవచ్చు. ఇవి అకణ లేదా ఏకకణ జీవులు. వీటిని కణరహిత జీవులని చెప్పవచ్చు.

2. ఏకాంత లేదా సామూహికంగా జీవిస్తాయి. ఇవి స్వతంత్ర జీవులుగాగాని, సహభోక్తలుగాగాని, సహజీవులుగాగాని, పరాన్న జీవులుగా గాని నివసిస్తాయి.

3. ఇవి ప్రపంచం అంతటా విస్తరించి ఉంటాయి. అన్ని ప్రాంతాలలో నీరు, నేల, గాలి, జీవుల పైన, లోపల నివసిస్తాయి.

4. జీవులు గోళాకారంగా, వర్తులంగా, బల్లపరుపుగా ఉంటాయి. వీటిలో ద్విపార్శ్వ లేదా కిరణవలయ సౌష్ఠవం కనిపిస్తుంది. కొన్ని సౌష్ఠవ రహిత జీవులు, సాధారణంగా ఈ జీవుల ఆకారాలు స్థిరంగా ఉంటాయి. కొన్నింటిలో వాతావరణ పరిస్థితులు, వయస్సును బట్టి ఆకారం మారుతుంది.

5. వీటి పరిమాణం 0.002 మి.మీ. నుంచి 16 మి.మీ. వరకు ఉంటుంది. న్యుమ్ములైట్ అనే శిలాజీవి 19 సెం.మీ. ఉండే అతి పెద్ద జీవి.

6. శరీరం నగ్నంగా లేదా పెలికిల్ చేత ఆవృతమై ఉంటుంది. కొన్నింటిలో కర్పరాలు ఉంటాయి. కర్పరం జాంతవ పదార్థంతో లేదా సెల్యులోజ్ లేదా కర్బన, అకర్బన పదార్థాలతో, ఇసుక రేణువుల వల్ల ఏర్పడవచ్చు.

7. జీవసంబంధమైన చర్యలన్నీ ఒకే కణం నిర్వహిస్తుంది. దీనికి అనుగుణంగా వివిధ క్రియలను నిర్వర్తించే కణాంగాలు కణద్రవ్యంలో స్పష్టంగా ఉంటాయి. కణత్వచం దళసరిగా లేదా పలుచగా ఉండవచ్చు. దీనిలో చారలు, పోగులు, కణికలు, కండర తంతువులు ఉండవచ్చు. కండర తంతువులు సంకోచ, సడలికలకు ఊతమివ్వడానికి ఉపయోగపడ తాయి. పదార్థాల రవాణాకు సూక్ష్మ నాళికలు తోడ్పడతాయి.

8. గమనం కోసం మిథ్యాపాదాలు, కశాభాలు, శైలికలు ఉంటాయి. ఇవి ఆహార సేకరణకు తోడ్పడతాయి.

9. కణంలో ఒక కేంద్రకం, కొన్నింటిలో రెండు, అంతకంటే ఎక్కువ ఉంటాయి. స్థూల కేంద్రకం జీవక్రియలో పాల్గొంటే సూక్ష్మ కేంద్రకం ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది.

10. ఇవి స్వయం పోషకాలు లేదా పరపోషకాలు. పాదపీయ భక్షణ, జాంతవ భక్షణ కనిపిస్తుంది. పూతికాహారులుగా జీవిస్తాయి. ఆహారరిక్తిక తాత్కాలిక జీర్ణాశయంలాగా తోడ్పడుతుంది. కొన్ని జీవులలో కణముఖం, కణపాయువు ఉంటాయి.

11. శ్వాసక్రియ వ్యాపనం ద్వారా జరుగుతుంది. పరాన్న జీవులు అవాయు శ్వాసక్రియ జరుపుతాయి..

12. విసర్జన క్రియ శరీర ఉపరితలం ద్వారా లేదా సంకోచరిక్తికల వల్ల జరుగుతుంది. అయితే సంకోచరిక్తికలు ద్రవాభిసరణ క్రమతలో తోడ్పడతాయి. ఈ ప్రక్రియలో సంకోచరిక్తికలు నత్రజని విసర్జితాలను గ్రహిస్తాయి. సముద్ర జీవులలో, పరాన్న జీవులలో ఈ రిక్తికలు ఉండవు.

13. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధావిచ్ఛిత్తి లేదా బహుధా విచ్చిత్తి ద్వారా జరుగుతుంది. ఈ జీవులలో విఖండ జననం విధిగా జరుగుతుంది. కొన్ని బహు కేంద్రక జీవులలో కేంద్రక విభజన జరగకుండా కణ పదార్థ విభజన మాత్రం జరిగి రెండు లేదా అంతకంటే ఎక్కువ బహు కేంద్రక పిల్ల జీవులు ఏర్పడతాయి. దీన్ని ప్లాస్మోటోమి అంటారు. ఇవే కాకుండా కోశీ భవనం, పునరుత్పత్తి జరుగుతాయి. లైంగిక ప్రత్యుత్పత్తి సంయుగ్మంతో బీజ కణాల కలయికతో జరుగుతుంది.

14. ఇవి పురాజీవ మహాయుగ కాలంలోని ప్రీకేంబ్రియలో ఆవిర్భవించాయి. దాదాపు 30,000 రకాల ప్రోటోజువన్లు ఉన్నాయి.

1.4 వర్గీకరణ

ఈ జీవుల వర్గీకరణ భేదాభిప్రాయలతో కూడుకొని ఉంది. వివిధ శాస్త్రవేత్తలు వేర్వేరు వర్గీకరణల్ని ప్రకటించారు. ఇవి అతి క్లిష్టంగా ఉండి ఒక స్పష్టమైన స్వరూపాన్ని ఇవ్వలేక పోయాయి. బి.ఎమ్. హానిగ్ బర్గ్ (1964), కార్లిప్స్ (1967) ప్రోటోజువా వర్గాన్ని నాలుగు ఉపవర్గాలుగా విభజించారు.

ఉపవర్గం : I సార్కోమాస్టిగోఫొరా

1. వీటి ప్రధాన చలనాంగాలు కశాభాలు, మిథ్యాపాదాలు లేదా వీటిలో ఏదైనా ఒకటి. 2. కశాభాలు ప్రధాన చలనాంగాలు. ఒకటి లేదా అనేక కశాభాలుంటాయి.

2. కణ పదార్థంలో ఒకే రకమైన కేంద్రకం ఉంటుంది.

3. ఫారామిని ఫెరా అభివృద్ధి దశలలో కేంద్రకం కనిపించదు.

4. ద్విధా, బహుధా విచ్ఛిత్తి ద్వారా అలైంగికోత్పత్తి జరుగుతుంది.

5. బీజ కణాల కలయిక ద్వారా లైంగికోత్పత్తి జరుగుతుంది.

అధి విభాగం 1. మాస్టిగోఫొరా

1. ఏకాంత లేదా సహనివేశ జీవులు.

3. శరీరాన్ని కప్పి సన్నని పెలికిల్ ఉంటుంది. కొన్ని జీవులు సెల్యులోజ్ వంటి గుళికలలో ఉంటాయి.

4. ఒకే కేంద్రకం ఉంటుంది. 5. అంతర్జీవ ద్రవ్యానికి, బాహ్యజీవ ద్రవ్యానికి ఎక్కువ భేదం కనిపించదు.

విభాగం 1. ఫైటోమాస్టిగోఫారా

1. క్రొమాటోఫోర్లుంటాయి.

2. వీటిలో ఒకటి లేదా రెండు కశాభాలుంటాయి.

3. స్వయంపోషణ జరుగుతుంది. 4. ఎర్రని కంటి చుక్క ఉంటుంది. 5. ప్రత్యుత్పత్తి సంయుక్త సంయోగం వల్ల జరుగుతుంది.

ఈ విభాగంలో క్రైసోమోనాడిడా, సిలికోప్లాజెల్లిడా, కాకోలిథోఫోరిడా, హెటిరోక్లోరిడా, క్రిప్టోమొనాడిడా, డైనోప్లాజెల్లిడా, ఎబ్రీడా, యూగ్లీ నిడా, క్లోరోమొనాడిడా, వాల్వోసిడా అనే క్రమాలున్నాయి.

ఉదా॥ క్రోమ్యులినా, క్రైసమీబా, డిక్టియోకా, క్లాత్రోపిక్సిడెల్లా, డిస్కో ఆస్టర్, కాకోలిథిస్, హెటిరోక్లోరిస్, కైలో మొనాస్, నార్టిల్యుకా, సిరేషియం, ఎబ్రియా, యూగ్లీనా, గోనియో స్టోమమ్, వాల్వాక్స్, పాండోరైనా.

2. జూమాస్టిగోఫోరా

1. సాధారణంగా ఒక కేంద్రకముంటుంది.

2. వీటిలో కశాభాలు రెండు లేదా లెక్కలేనన్ని ఉంటాయి

3. కండర తంతువుల వంటి నిర్మాణాలుం .

4. క్రోమాటోఫోర్లు ఉండవు.

5. కొన్ని జీవులు జాంతవ భక్షక జీవులు. మరికొన్ని పూతికాహారులు, చాలా వరకు పరాన్నజీవులు.

ఇందులో కైనటోప్లాస్టిడా, రైజోమాస్టిజిడా, బైక్రోసోసిడా, రిటార్టోమొనాడిడా డిప్లోమొనాడిడా ఆక్సిమొనాడిడా, ట్రైకోమొనాడిడా, హైపర్ మాస్టడా, ఖోయానోప్లాజెల్లిడా అనే క్రమాలుంటాయి. ఉదా. ట్రిపానోసోమా,

లీష్మానియా, డైమార్పా, మాస్టగమీబా, బైక్రోసోకా, రిటార్టోమొనాస్, జియార్డియా, ఆక్సిమొనాస్, ట్రైకోనింఫా, లోఫోమొనాస్.

అధి విభాగం 2 ఒపాలినేటా

1. ఇవి పరాన్న జీవులు.

2. దేహ ఉపరితలమంతా శైలికల వంటి నిర్మాణాలతో కూడి ఉంటుంది. 3. కణంలో అనేక కేంద్రకాలుంటాయి.

3. ఇవి సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. బీజాన్ని ఆవరించిన త్వచం కొన్ని కవాటాలతో ఏర్పడుతుంది. బీజాలలో రెండు ధ్రువ తంతువులుంటాయి. ఇందులో మిక్సోస్పోరిడా, ఏక్టినోమిక్సిడా, హెలికోస్పోరిడా అనే క్రమాలు ఉంటాయి. ఉదా: మిక్సీడియం, లెప్టోథీకా, ట్రయాక్టినోమిర్డాన్, హెలికోస్పోరిడియం.

విభాగం 2 మైక్రోస్పోరీడియా

1. ఇవి కీటకాలలో కణాంతస్థ పరాన్నజీవులు.

2. సిద్ధ బీజాలు చిన్నవిగా ఉంటాయి. ఒకే ధ్రువ తంతువు ఉంటుంది. ఇందులో మైక్రోస్పోరిడా క్రమం ఉంటుంది.

ఉదా: క్లాడోస్పారా, నోసెమా.

ఉపవర్గం IV సీలియోఫొర

1. ఇవి శైలికలతో ఉంటాయి.

2. రెండు రకాల కేంద్రకాలుంటాయి. ఇవి స్థూల, సూక్ష్మ కేంద్రకాలు.

3. పోషణ పూతికాహార, జాంతవ భక్షణ ద్వారా జరుగుతుంది.

4. అలైంగికోత్పత్తి, ద్విధా విచ్ఛిత్తి, మొగ్గలు వేయడం వల్ల జరుగుతుంది

5. లైంగికోత్పత్తి సంయోగం లేదా ఆత్మ సంపర్కం వల్ల జరుగుతుంది. 6. చాలా వరకు స్వేచ్ఛా జీవులు, కొన్ని పరాన్న జీవులు. విభాగం 1 సీలియేటా

1. శరీరం పై దళసరి రక్షక త్వచం లేదా పెలికిల్ ఉంటుంది.

2. శైలికలు గమనాంగాలు.

3. రెండు కేంద్రకాలుంటాయి.

4. ఒకటి లేదా కొన్ని సంకోచరిక్తికలుంటాయి.

5. ఇవి మంచి నీటిలో లేదా సముద్ర జలాల్లో జీవిస్తాయి.

ఇందులో హాలో ట్రెకియా, పెరిట్రైకియా, సక్టోరియా, స్పైరోట్రెకియా అనే ఉప విభాగాలు ఉంటాయి. వీటిలో జిమ్నో స్టామాటిడా, ట్రైకోస్టామాటిడా, కోనో ట్రెకిడా, ఎపోస్టోమాటిడా, ఎస్టోమాటిగా, హైమనోస్టామాటిడా, థిగ్మోట్రెకిడా, పెరిట్రెకిడా, సక్టోరిడా, హెటిరో ట్రెకిడా, ఆలిగోట్రెకిడా, టింటినిడా, ఎంటోడినియోమార్ఫిడా, ఒడాంటోస్టోమానిడా, హైప్రోడీనియా అనే క్రమాలు ఉంటాయి.

ఉపవర్గం II స్పోరోజువా

4. ఒక కేంద్రకం ఉంటుంది.

1. ఇవి చాలా వరకు పరాన్న జీవులు. 2. శరీరం అవభాసిని లేదా రక్షకత్వచంతో కప్పి ఉంటుంది. 3. గమనానికి కావలసిన కణాంగాలు లోపిస్తాయి. 5. అలైంగికోత్పత్తి బహుధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది.

6. లైంగికోత్పత్తి స్థూల, సూక్ష్మ సంయోగ బీజాల కలయిక వల్ల జరుగుతుంది.

ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. అవి : 1. టెలోస్పోరియా, 2. టాక్సోప్లాస్మియా, 3, హాస్లోస్పోరియా.

విభాగం 1 టెలోస్పోరియా

1. జీవులు సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. 2. జారుడు చలనం లేదా దేహం సంకోచించడం వల్ల గమనం జరుగుతుంది. 3. మిథ్యాపాదాలుండవు. ఒకవేళ ఉంటే ఆహార సేకరణకు తోడ్పడతాయి. 4. సూక్ష్మ సంయోగ బీజాలు కశాభాలను కలిగి ఉంటాయి.

ఇందులో [గారినియ, కాక్సీడియ అనే ఉపవిభాగాలు ఉంటాయి. వీటిలో అర్కి గ్రిగారినిడా, , యుద్రిగారినిడా, నియోగ్రిగారినిడా, ప్రోటోకాక్సిడా, యూకాక్సిడా అనే క్రమాలు ఉంటాయి. ఉదా: సెలేనేడియం, మోనోసిస్టిస్, గ్రిగారినా, ఓఫ్రియోసిస్టిస్, యుకాక్సీడియం, ఐమీరియా,

ప్లాస్మోడియం.

విభాగం 2 టాక్సోప్లాస్మియా

1. ఇవి సకశేరుకాల పై పరాన్నజీవులు.

2. వీటిలో సిద్ధ బీజాలు ఏర్పడవు.

3. అలైంగికోత్పత్తి ద్విధావిచ్చిత్తి ద్వారా జరుగుతుంది

ఇందులో టాక్సోప్లాస్మిడా అనే క్రమం ఉంటుంది.

ఉదా: సార్కోసిస్టిస్, టాక్సోప్లాస్మా.

2005 కేంద్రకం పరాన్నజీవి కండర తంతువు సార్కోసిస్టిస్

విభాగం 3 హాప్లోస్పోరియా

1. ఇవన్నీ పరాన్న జీవులు.

2. అమీబాయిడ్ సిద్ధ బీజాలు ఏర్పడతాయి.

ఇందులో హాప్లోస్పోరిడా అనే క్రమం ఉంటుంది.

ఉదా: హాప్లోస్పోరీడియం, సీలోస్పోరీడియం.

ఉపవర్గం III నీడోస్పారా

1. ఇవన్నీ పరాన్న జీవులు.

2. సిద్ధ బీజాలు గట్టి కవచ నిర్మాణంతో ఉంటాయి.

3. అలైంగికోత్పత్తి ద్విధా విచ్ఛిత్తి లేదా బహుధా విచ్ఛిత్తి వల్ల, మొగ్గలు వేయడం వల్ల జరుగుతుంది.

4. లైంగికోత్పత్తి సమసంయోగ బీజాల వల్ల, అసమసంయోగ బీజాల వల్ల జరుగుతుంది.

ఇందులో మిక్సోస్పోరిడియా, మైక్రోస్పోరిడియా అనే విభాగాలు ఉంటాయి. విభాగం 1 మిక్సోస్పోరిడియా

1. ఇందులో అన్నీ పరాన్న జీవులు ఉంటాయి.

2.త్వచం ఆవరించి ఉన్న వివిధ రూపాలలో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page