![]() |
EMRS Recruitment 2023 |
ఏకలవ్య పాఠశాలల్లో 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులు:
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల (EMRS) లలో 6,329 పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
1. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు :
హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్, ఆర్ట్, పీటీటీ (పురుషులు), పీఈటీ (స్త్రీలు), లైబ్రేరియన్
2. హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు
3. హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు
అర్హత: TGT ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్. TGT-PET పోస్టులకు డిగ్రీ, బీపీ ఈడీ, TGT Librarian పోస్టులకు డిగ్రీ, బీఎల్ఎస్సీ.
వయసు: 18.8.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతన శ్రేణి: TGT ఉద్యోగాలకు రూ.44900-142400/ రూ. 35400-112400;
హాస్టల్ వార్డెన్ కు రూ.29200-92300.
ఎంపిక: EMRS Staff selection Exam-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
పరీక్ష: OMR ఆధారిత (Pen-Paper) విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు (120 ప్రశ్నలు), లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు (30 ప్రశ్నలు)కేటాయించారు.
హాస్టల్ వార్డెన్ రాత పరీక్షకు 120 మార్కులు (120 ప్రశ్నలు) కేటాయించారు.