మహిళలకు ఉచిత కుట్టు మిషన్ | Free Sewing Machine scheme : మహిళలకు ఉచిత కుట్టు మిషన్ కోసం వెంటనే అప్లై చేసుకొండి

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Group Follow Now
Free Sewing Machine scheme

Indiramma Mahila Shakti Free Sewing Machine scheme : తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. మహిళల స్వయం ఉపాధి కోసం, ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీ మహిళలకు ఉచిత గృహ కుట్టు మిషన్లను అందించడం అనేది ఒక ప్రధానమైన ముందడుగుగా నిలిచింది. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి, మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడమే ముఖ్య లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

👉పూర్తి వివరాలకు & APPLY చేయుటకు కింద క్లిక్ చేయండి👇
ఈ పథకం కింద తెలంగాణలోని క్రిస్టియన్ మైనారిటీ మహిళలకు ఉచిత గృహ కుట్టు మిషన్లు అందించనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ప్రత్యేకంగా ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తులను tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆహ్వానిస్తున్నారు.

ముఖ్యమైన వివరాలు:
• ఈ పథకం క్రిస్టియన్ మైనారిటీ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది.
ఉచిత కుట్టు మిషన్లు పొందడానికి అనుగుణమైన అర్హతలు మరియు పత్రాలను సమర్పించడం తప్పనిసరి.
ఒక్క కుటుంబానికి ఒక కుట్టు మిషన్ మాత్రమే అందజేయబడుతుంది.
* గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షలలోపు ఉండాలి.
• పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షలలోపు ఉండాలి.
ఉచిత కుట్టు మిషన్ పొందాలంటే కనీసం 5వ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి
వయస్సు కంటే తక్కువ : 21 ఏళ్లు
వయస్సు కంటే ఎక్కువ : 55 ఏళ్లు

దరఖాస్తు రుసుము
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి రుసుము అవసరం లేదు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి
tgobmms.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించండి. ఆన్లైన్లో ఫారం పూరించండి.
‘అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.
• స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించండి. 
• పూర్తి చేసిన దరఖాస్తును సమర్పించండి.

కావలసిన డాక్యుమెంట్ వివరాలు
• బాప్టిజం సర్టిఫికేట్

• బీసీ సీ సర్టిఫికేట్
• వయో ధృవీకరణ పత్రం (ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ)
• శిక్షణ ధృవీకరణ పత్రం
• తెల్ల రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం

ముఖ్యమైన తేదీలు
ఈ పథకం దరఖాస్తు ప్రారంభ తేదీ మరియు ముగింపు తేదీ గురించి సంబంధిత మైనారిటీ సంక్షేమ కార్యాలయాలను సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page