హైడ్రోజోవన్ (Hydrozoan) సమూహానికి ఒక చక్కని ఉదాహరణ. ఎందుకంటే
దీనిలో మూడు ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. అని అలైంగిక, లైంగిక
ప్రత్యుత్పత్తులు ఏకాంతరంగా జరగడం. ఒకే జీవిలో ద్విరూపకత (Dimorphism) కనిపించడం, సహనివేశ జీవిగా నివసించడం. దీనిలోని అనేక
ప్రజాతులు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఒబిలియా జెనిక్యులేటా (Obelia
geniculata) గురించి కింద వివరించడమైంది.
ఫసిపిక్ సముద్ర తీరాల్లో అధికంగా ఉంటాయి. ఇవి సాధారణంగా 80 మీటర్లు లోతులో కూడా నివసిస్తాయి. ఈ జీవి అలైంగిక, లైంగిక
రూపాల్లో (ద్విరూపకత) కనిపిస్తుంది. అలైంగిక జీవిని హైడ్రాయిడ్ సహనివేశం అంటారు.
ఇందులో అనేక శాఖలు, ప్రతీ శాఖకు కొన్ని మొగ్గలు ఉంటాయి. ఈ
మొగ్గలను కొన్ని జీవకాలుగా భావిస్తారు. ఇవి కాండానికి అట్లాగే ఉండిపోయి ఒక క్లిష్ట
సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఇంచుమించు ఇవి ఒక వృక్షాకారంగా ఉండి రాళ్ళకు, కర్పరాలకు, కర్రదుంగలకు కొన్ని పెద్ద చీడ మొక్కలకు
అతికి ఉంటాయి. ఒబిలియా చాలా సున్నితంగా, ఈ కలవలె తెల్లగా
లేదా లేత గోధుమ వర్ణంతో ఉంటుంది. ఇది ఒక అంగుళం నుంచి ఎన్నో అంగుళాల పొడవుండవచ్చు.
లైంగిక జీవి ఘంటాకారంలో లేదా గొడుగు ఆకారంలో స్వేచ్ఛాగా ఈదుతూ మెడ్యుసాగా
పిలవబడుతుంది.
1.2 హైడ్రాయిడ్ సహనివేశం – నిర్మాణం
సహనివేశంలో అనేక పోగుల వంటి శాఖలు కనిపిస్తాయి. దీనిలో గల అనేక
నిలువు కాండములు 2.3 సెం.మీ. పొడవుతో హైడ్రోజా లేదా స్టోలన్ (Hydrorhiza
or stolon) నుంచి వెలువడే సూసాకార గొట్టాల వంటి ఆకారాలను హైడ్రోకాలి
(Hydrocauli) అంటారు. హైడ్రోరైజా ఎప్పుడూ అడ్డంగా నేళ్ళవలె
నీటిలో పాకి ఉండి అధఃస్థలాన్ని అంటి పెట్టుకొని ఉండటం వల్ల జీవి కదలకుండా ఉంటుంది.
ఈ రెండు కూడా సన్నని దారపు పోగుల మందంతో గుళ్ళగా ఉండే నాళాల వంటి నిర్మాణాలు. ఈ
హైడ్రోకాలు కాండం నుంచి ఏకాంతరంగా ఏర్పడతా ఈ పార్శ్వశాఖలు కొన్నిసార్లు మరిన్ని
శాఖలను ఏర్పరుస్తాయి. ప్రతీ శాఖను ఒక ప్రౌఢ జీవిగా పరిగణిస్తారు. ప్రతీ శాఖ చివరి భాగంలో
పాలిప్ (Polyp) లేదా హైడ్రాక్ట్ (hydranth) ఉంటుంది. బాగా ఎదిగిన పాలిమ్ స్థానే స్తూపాకారంలో గల జీవకాలు
బ్లాస్టోస్టైల్స్ (Blastostyles) ఏర్పడతాయి. ఈ విధంగా
ఒబిలియా సహనివేశంలో రెండు రకాల జీవకాలు ఉండటం వల్ల దీన్ని ద్విరూపక జీవి అంటారు.
తరవాత బ్లాస్టోస్టైల్స్ సాసర్ లేదా గొడుగు ఆకారంలో గల మెడ్యుసాలను అభివృద్ధి
చెందించినప్పుడు సహనివేశం త్రిరూపకతను సంతరించుకొంటుంది.
సహనివేశంలోని శాఖలు, జీనకాలు రెండు రకాల
త్వచాలను కలిగి ఉంటాయి. అవి లోపలి వైపున గల నాళం నంటి జీవం గల సీనోసార్క్ (Cocnosarc),
దృఢంగా నిర్జీవమైన కొమ్ము త్వచం సెరిసార్క్ (Perisarc), పెరిసార్క్ శరీరాన్నంతటిని కప్పి ఉంచుతుంది. .
(ఎ) సీనోసార్క్ : జీవి కాండాలను, జీవకాలను
కైటినస్ పదార్థంతో చేసిన గొట్టం వంటి బోలు నిర్మాణం ఆవరించి ఉంటుంది. దీన్నే
సీనోసార్క్ అంటారు. ఈ సీనోసార్క్ మధ్యన కుల్య ఉంటుంది. ఈ కుల్య ప్రౌఢ జీవి యొక్క
కుహరంలో జీర్ణమైన ఆహార పదార్థాలు ఈ కుల్య ద్వారా సహనివేశం అంతటా ప్రవహిస్తాయి. సీనోసార్క్
బహిస్త్వచం, అంతస్వచం అనే రెండు పొరలతో నిర్మితమై ఉంటుంది. ఈ
రెండు త్వచాల మధ్య పారదర్శక, కణ రహీత, మధ్య
శ్లేష్మసరం ఉంటుంది.
(బి) పెరిసార్క్ : ఒబిలియా సహనివేశం పారదర్శకమైన రక్షణ త్వచంతో
ఆవృతమై ఉంటుంది. ఈ పొరను పెరిసార్క్ అంటారు. ఇది బహిస్త్వచం ద్వారా
స్రవించబడుతుంది. ఇది ఇంచుమించు సెలో పెన్ లాగా బాహ్య అస్థిపంజరాన్ని
ఏర్పరుస్తుంది. ఈ కణరహిత బాహ్య కవచం పసుపు పచ్చగాను లేదా గోధుమ వర్ణంగాను ఉంటుంది.
మొదట పెరిసార్క్ బహిస్యచం నుంచి స్రావితమై సీనోసార్క్ ను అంటిపెట్టుకొని ఉంటుంది.
జీవి ఎదిగిన కొద్దీ సీనోసార్క్, పెరిసార్క్ ల మధ్య కొంత ఖాళీ
స్థలం ఏర్పడుతుంది. కానీ కొన్ని ప్రాంతాలలో అంతస్త్వచకణాలతో దీనికి సంబంధముంటుంది.
పెరిసార్క్ దృఢత్వం వల్ల జీవికాండం లేదా దాని నుంచి వచ్చే శాఖలను అటు ఇటు కదలకుండా
ఉంచుతుంది. కానీ అక్కడక్కడ పెరిసార్క్ అంతస్యచ కణాలతో అడ్డంగా కలియడం వల్ల గంటుల
వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వీటిని ఉపఖండితాలు (Annuli) అంటారు.
ఉపఖండితాల వల్ల సహనివేశంలోని కొన్ని శాఖలు సులువుగా కదలగలుగుతాయి. ప్రతీ జీవకం
ఆధారం వద్ద పెరిసార్క్ ఉపఖండితాలను కలిగి ఉంటుంది. వీటిని పెరిసార్కల్ ఉపఖండితాలు
(Perisarcal annuli) అంటారు.
(సి . జీవకాలు : ఒబిలియా సహనివేశంలో రెండు
రకాల జీవకాలు కనిపిస్తాయి. ఒక రకాన్ని పాలిక్లు లేదా హైడ్రాన్లు (Hydranth)
అని అంటారు. ఇవి సహనివేశాన్ని పోషిస్తాయి. కాబట్టి వీటిని పోషక
జీవకాలు అంటారు. రెండవ రకం ప్రత్యుత్పత్తికి సంబంధించిన గొనాన్షియమ్ (Gonangium)
లేదా బ్లాస్టోస్టెల్ (Blastostyle) తో ఉంటుంది.
దీని నుంచి ఎన్నో చిన్న చిన్న గిన్నెల వంటి ఆకారాలు మొగ్గల రూపాలలో ఏర్పడతాయి.
వీటినే మెడ్యుసాలు అంటారు. అందువల్ల ఒబిలియా సహనివేశాన్ని బహురూపక జీవి అని కూడా
చెప్పవచ్చు. ఈ రెండు జీవకాల నిర్మాణంలో శరీర ధర్మాలలో విభేదనం స్పష్టంగా
కనిపిస్తుంది.
పాలిప్ లేదా హైడ్రాచ్ : గ్రీకులో పాలిపస్ అంటే అనేక పాదాలు అని,
hydra – water serpent + anthos = పుష్పం అని అర్థం. ఇవి పోషక
జీవకాలు. ఈ జీవకం పసుపు రంగులో స్తూపాకారంగా లేదా తిత్తి లాగా సూక్ష్మంగా హైడ్రా
రూపంలో ఉంటుంది పాలిప్ వృంతం బోలుగా, ఇరుకుగా ఉండి
హైడ్రోకాలస్ యొక్క సీనోసార్క్ చేత కలపబడి ఉంటుంది. జీవకం స్వేచ్ఛగా ఉన్న పూర్వ
భాగాన శంఖువలె ఉబ్బెత్తయిన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీన్నే గ్రేవేయకం (Manubrium)
లేదా హైపోస్టోమ్ (Hypostome) లేదా ముఖ శంఖువు
(Oral cone) అంటారు. ఈ గ్రెవేయకం హైడ్రాచ్ మొత్తం పొడవులో 3/4
వంతు ఆక్రమిస్తుంది. క్రైవేయకం అగ్రభాగాన నోటి రంధ్రం ఉంటుంది. ఈ
రంధ్రానికి సంకోచ, వ్యాకోచం చెందే గుణం ఉంటుంది. గ్రేవేయకం
పరిభాగం చుట్టూ దాదాపుగా ఇరవై నాలుగు స్పర్శకాలు వలయాకారంలో అమరి ఉంటాయి.
స్పర్శకాలు పొడవుగా ఉండి కోసుగా అంతమవుతాయి. హైడ్రాలో లాగా స్పర్శకాలు బోలుగా
ఉండవు. ఒబీలియా స్పర్శకాలు ఘనంగా ఉంటాయి. దీనివల్ల స్పర్శకాలు బాహ్యంగా బహిస్యచ
కణాలతోను లోపల ఒక వరసలో అంతస్యచ కణాలతోను ఉంటాయి. పాలిప్ మధ్య జఠర ప్రసరణ
కుహరాన్ని కలిగి ఉంటుంది. పాలిప్ బాహ్య త్వచ కణాలతోను అంతస్యచ కణాలతోను
ఏర్పడుతుంది. ఈ రెండు పొరలు నోటి వరకు వ్యాపించి ఉంటాయి. ఈ రెండింటి మధ్య, మధ్య శ్లేష్మసరం ఉంటుంది.
పెరిసార్క్ హైడ్రాచ్ చుట్టూ చాలా వదులుగా త్రికోణాకారపు కప్పులాగా
ఏర్పడి రక్షణకు ఉపయోగపడుతుంది. హైడ్రాన్ఏ ను ఆవరించి ఉన్న పెరిసార్క్ ను హైడోథీకా
అని అంటారు. ఇది పూర్తిగా పారదర్శకంగా వర్ణరహితంగా ఉంటుంది. పాలిప్ పరభాగం వృంతం
అమరి ఉన్న స్థలంలో పెరిసార్క్ వలయాకారంలో చుట్టుకొని ఉంటుంది. దీన్నే షెల్ఫ్ (shelt)
అంటారు. దీని వల్ల పాలిప్ ముడుచుకొన్నప్పుడు పూర్తిగా లోపలికి
చొచ్చుకొని పోకుండా ఉంటుంది. షెల్ఫ్ మధ్య ఉన్న రంధ్రం ద్వారా పాలిప్ కాండం యొక్క
సీనోసార్క్ కు సంబంధించి ఉంటుంది. మొదట్లో ఉపఖండాలు ఉండటం వల్ల పాలిప్ సులువుగా
అటు ఇటు కదలగలుగుతుంది.
(i) బాస్టో స్టైల్స్: హైడ్రోకాలస్ పూర్తిగా ఎదిగిన తరవాత
స్తూపాకారపు అంగాలను ఉత్పన్నం చేస్తుంది. వీటిని బ్లాస్టోస్టెల్ లేదా
బ్లాస్టోజువాయిలు అంటారు. ఇవి పాలిప్ కంటే తక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. ఇవి శాఖల
మొదళ్ళలో బాగా పండిన హైడ్రా అక్షాల వద్ద కనిపిస్తాయి. వీటికి నోరు, స్పర్శకాలు ఉండవు. వీటిలోని జఠర ప్రసరణ కుహరాలు అంతగా ఎదిగి ఉండవు.
బ్లాస్టో స్టైల్ ను కప్పిన పెరిసార్క్ వదులుగా పారదర్శకమై కూజా వంటి గుళిక ఆకారంలో
ఉంటుంది. దీన్ని ఉత్పాదకాచ్ఛాదం (Gonotheca) అంటారు. దీని
అగ్ర భాగాన కాలర్ వంటి (Collar) నిర్మాణముంటుంది.
(ii) బ్లాస్టోస్టెల్ పార్శ్వ అలైంగిక కోరకీభవనం ద్వారా లైంగిక
జీవకాలను, మెడ్యుసాలను లేదా గోనోపోర్స్ (Gonophores)ను ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా వివిధ అభివృద్ధి దశలలో గల మెడ్యుసా
రూపాలు బ్లాస్టోస్టెల్ పై కనిపిస్తాయి. ఈ మొగ్గలు మొదట ఒక చిన్న బుడిపె లాగా ఏర్పడి
గిన్నె ఆకారాన్ని దాలుస్తాయి. పరిపూర్ణంగా ఎదిగిన మెడ్యుసాలు బ్లాస్టోస్టెల్ నుంచి
విడిపోయి ఉత్పాదికాచ్ఛాదం దూరస్థభాగం పగిలిపోగా ఏర్పడిన గోనోపోర్ రంధ్రం ద్వారా
బాహ్య పరిసరాలలో గల నీటిలోకి ప్రయాణిస్తుంది. ఉత్పాదికాచ్ఛాదం కప్పి ఉంచిన
బ్లాస్టోస్టైల్, గోనోపోర్లను అన్నింటిని కలిపి గొనాంజియమ్ (Gr.
gonos గింజలు + angeion
, పాత) అని అంటారు.
1.4 కణజాల శాస్త్రం (Histology)
సాధారణంగా పాలిప్, బ్లాస్టోస్టెల్, సీనోసార్క్, మెడ్యుసా మొగ్గల కణాలు ఇంచుమించు హైడ్రా
కణాల లాగా ఉంటాయి. శరీర కుడ్యం రెండు పొరలతో ఉంటుంది. దీన్ని బహిస్యచం, జఠర చర్మం అని అంటారు. వీటి మధ్య సున్నితమైన పారదర్శక, కణరహిత స్తరం ఉంటుంది. దీనినే మధ్య శ్లేష్మస్తరం అంటారు.
స్తూపాకార కణాల సమూహంతో గాని ఉంటుంది. కణాలు ఏడు రకాలు.
(1) ఉపకళా కండర కణాలు (epitheliomuscular
cells)
(2) మధ్యాంతర
కణాలు (interstitial cells)
(3) దంశ
కణాలు (nematocysts)
(4) జ్ఞాన
కణాలు (sensory cells)
(5) నాడీ
కణాలు (nerve cells)
(6) గ్రంథి
కణాలు (gland cells)
(germ cells).
1. ఉపకళాకండర కణాలు : ఈ కణాలు బాహ్య చర్మంలో అధికంగా ఉంటాయి. ఇవి స్తంభాకారంగా
ఉంటాయి. వీటి బాహ్య భాగం వెడల్పుగా ఉండి, పక్క వాటితో కలుసుకొని
ఒక అవిచ్ఛిన్నమైన పొరలాగా ఏర్పడతాయి. కణం లోపలి భాగం ఇరుకుగా ఉండి, చివర సంకోచం చెందే రెండు పొడవాటి కీలితాలు ఉంటాయి. వీటిని కండర కీలితాలని
లేదా కండర పుచ్చాలని (Muscletails) పిలుస్తారు. ప్రతీ
కీలితంలో రెండు సంకోచం చెందే తంతువులుంటాయి. వీటిని మయోనీమ్ లు అంటారు. ఇవి ఉన్న కణభాగం
ఆయత కండరంలాగా ప్రవర్తిస్తుంది. అందువల్ల శరీరం సడలినప్పుడు పొడవుగానో లేదా సంకోచం
చెంది పొట్టిగానో అవుతుంది. కణ పదార్థం రిక్తి కామయంగా ఉంటుంది. కణ మధ్య భాగంలో ఒక
కేంద్రకం కేంద్రకాంశంతో స్పష్టంగా కనిపిస్తుంది. వెడల్పాటి కణభాగంలో కొన్ని
కణాలుంటాయి. నీటి స్రావాలతో జీవి దేహాన్ని బయటి వైపు కాపాడే అవభాసిని అనే పొర
తయారవుతుంది.
ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శినితో చూసినప్పుడు ఈ కణాలలో కేంద్రకంతో పాటు
గాలిదేహాలు, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్
రెటిక్యులమ్, రైబోసోములు, లైసోసోములు,
రిక్తికలు ఉంటాయని తెలిసింది. కణత్వచం వెలుపలి తలంలో కొన్ని సూక్ష్మ
చూషకాలు (microvilli) ఉంటాయి. ఈ త్వచం కిందుగా అంచులవెంబడి
కొన్ని శ్లేష్మాన్ని స్రవించే దేహాలుంటాయి. వీటి స్రావకాలు కణం ఉపరితలంపై మందమైన పొరను
ఏర్పరుస్తాయి. కణపు ఆధార భాగం కండరకీలితాలను (muscle processes) కలిగి ఉంటుంది. ఈ కీలితాలు దేహం అక్షానికి సమాంతరంగా అమరి ఉంటాయి. ఈ కీలితాలలో
పెద్దవి, చిన్నవి మయోఫిలమెంట్లు ఉండి కండర తంతువులను ఏర్పరుస్తాయి.
ఈ
మయోఫిలమెంట్లు కణత్వచం వద్ద మందంగా అంతమవుతాయి. వీటికి సంకోచ శక్తి
ఉంటుంది.
2. మధ్యాంతర కణాలు: ఇవి ఉపకళాకండర కణాల ఇరుకు భాగాల మధ్యన ఉండే
స్థలాల్లో ఉంటాయి. ఇవి గుండ్రంగా, చిన్నగా 0.5 మైక్రాన్ల వ్యాసం గల అఖండ (Undifferentiated)
కణాలు, ప్రతీ కణంలో స్వచ్ఛమైన జీవపదార్థం,
ఒక కేంద్రకాంశం గల పెద్ద కేంద్రకం ఉంటాయి. ఈ కణాలు విభజన చెంది
బాహ్య చర్మంలోని అన్ని కణాలను ఉత్పన్నం చేస్తాయి. కాబట్టి వీటిని టోటిపొటెంట్ (Totipotent)
అంటారు. ఇవి శరీరంలోని అన్ని భాగాల పునరుద్ధరణకు, ప్రత్యుత్పత్తి
ముఖ్యాధారాలు.
వీటిని నిమటోబ్లాస్ట్ (Nematoblasts) లని, కుట్టు కణాలు (Stinging cells) అని కూడా అంటారు. ఇవి
స్పర్శకాలలో విరివిగా ఉంటాయి. ఇవి కొన్ని మధ్యాంతర కణాలు మార్పు చెందడం వల్ల
ఏర్పడతాయి. పరిపూర్ణంగా ఎదిగిన తరవాత ఇవి శరీర బాహ్య తలం మీదికి పాకుతాయి. నిడోబ్లాస్ట్
ఒక అండాకారపు సంచి. దీని లోపల ద్రవంతో నిండిన కోశం ఉంటుంది. దీన్ని దంశకణకోశం
(Nematocyst) అని పిలుస్తారు. మామూలుగా ఈ రెండింటిని కలిపి
దంశకణాలుగా వ్యవహరిస్తారు. దంశకణకోశం నుంచి దారం మాదిరిగా ఉండే ఒక పొడవాటి గొట్టం వెలువడుతుంది.
విశ్రమించిన స్థితిలో ఈ దారపు నాళం దంశకణంలో గడియారపు స్ప్రింగ్ లాగా చుట్టుకొని
ఉంటుంది. దంశకణం బయటి భాగాన్ని ఉపరికులం (Operculum) అనే మూత
కప్పి వేస్తుంది. దీనికి అంటి బయటకు పొడుచుకొని వచ్చే దంశబాహువు (Chidacil)
అనే వాడి అయిన సూది ఉంటుంది. దంశ కణ పదార్థంలో స్ఫుటంగా కనిపించే
కేంద్రకం ఉంటుంది. ఈ కణ పదార్థంలో సంకోచించే కండరపుపోగులుంటాయి. లాసో (Lasso)
అనే ఇటువంటి పోగు కొన్ని దంశకణాలతో కోశాన్ని అంటి ఉండటాన్ని
గమనించవచ్చు. ఈ పోగు దంశకణాన్ని శరీరం బయటకు పోకుండా నివారిస్తుంది.దంశ కణ కోశం
దారపు నాళం మొదట్లో మూడు చిన్న చిన్న కంటకాల వరసలు, మూడు
శూకికలు ఉంటాయి. నాళం చివర తెరచుకొని ఉంటుంది. కోశంలో హిప్నోటాక్సిన్ అనే ప్రోటీన్
సంబంధమైన విషపదార్థం ఉంటుంది. ఈ దంశకణాలు ఆత్మరక్షణకు, ఆహార సేకరణకు ఇతర
జీవుల పై దాడి చేయడానికి ఉపయోగ పడతాయి. ఏదైనా జీవి దంశబాహువును తాకినట్లయితే
దంశకణం అమాంతంగా పేలుతుంది. అప్పుడు కోశం లోపల అతి క్లిష్టంగా ముడుచుకొని ఉన్న
దారపు నాళం సాఫీగా సాగుతుంది. ఇంచుమించు ఇది సంచిని తిరగేసిన పద్ధతిగా ఉంటుంది.
దారం మొదట్లో ఉండే కంటకాలను, శూకి కలను స్ర్కూ మాదిరిగా
తిప్పి శత్రు జీవి శరీరాన్ని తొలచి లోపల ప్రవేశించి విషాన్ని వదులుతుంది. పర్యవసానంగా
మొద్దుబారి చలనరహిత మవుతుంది. ఒకసారి పేలిన దంశకణం నిరుపయోగమవుతుంది. అవి జఠర కుహరంలోకి
ఆహారంతో పాటు జీర్ణమవుతుంది. ఆ జీవి అన్ని వైపులా పోగులతో ఉంటుంది. శాఖీయమైన ఈ
పోగులను నాడీ తంతువులు అంటారు. నాడీ కణాల తంతువులు ఒకదానితో మరొకటి కలిసి మధ్య
శ్లేష్మస్తరం బయటివైపున నాడీ వలను ఏర్పరుస్తాయి. నాడీ కణాల తంతువులు ఉపకళాకండర
కణాలతోను, జ్ఞాన కణాలతోను సంబంధమేర్పరుచుకొని పరిసరాల్లోని
మార్పులను జ్ఞానకణాల ద్వారా గ్రహించి తగిన విధంగా శరీరాన్ని అదుపులో పెడతాయి.
5. జ్ఞాన కణాలు : ఇవి ఉపకళాకండర కణాల మధ్య అక్కడక్కడ ఉంటాయి. ఇవి
పొడవుగా సన్నగా ఉంటాయి. ప్రతీ కణం స్వేచ్ఛా తలం మీద ఒక కీలితం లేదా కశాభం, లోపలి వైపు బొడిపెలతో ఉండే రెండు తంతువులు ఉంటాయి. ఈ తంతువులు నాడీకణాల
తంతువులను కలుస్తాయి. ఈ సమ్మిళిత వ్యవస్థను నాడీ చాలక యంత్రాంగం అని అంటారు.
పరిసరాల్లోని మార్పులను ఈ కణాల ద్వారా జీవి గ్రహిస్తుంది.
6. గ్రంథికణాలు : వీటి కణపదార్థంలో, ముఖ్యంగా
బయటివైపు కణికలుంటాయి. ఈ కణికలు శ్లేష్మ పదార్థాన్ని. ప్రవిస్తాయి. ఈ పదార్థం
జీవికి అథస్థలాన్ని అంటిపెట్టుకోవడానికి, ఆహార పదార్థాలను
సులువుగా మింగడానికి ఉపయోగపడతాయి.
బి. జఠర చర్మం
శరీరంలోని జఠరప్రసరణ కుల్యావ్యవస్థలోని అన్ని భాగాలను జఠర ప్రసరణ
ఆదరిస్తుంది. దీనిలోని మధ్యశ్లేష్మస్తరంలోని పలచని మధ్యభాగం జఠర చర్మపు పొరలు
కలిసి జఠర తంతువులను ఏర్పరుస్తాయి. స్పర్శకోశాలు, అంచులలోని
స్పర్శకాలు జఠర ప్రసరణ కుల్యాభాగాలే కాబట్టి వీటి తలాలను కూడా జఠర చర్మం ఆవరించి
ఉంటుంది. బీజకోశాలు జఠర చర్మం నుంచి ఏర్పడతాయి. ఈ స్తరంలో కశాభ స్తంభాకార ఉపకళా కణాలు, మధ్యాంతర
కణాలు, గ్రంథికణాలు ఉంటాయి. నాడీ కణాలు, కండర నిర్మాణాలు లేవు. జఠర తంతువులపై అనేక దంశకణాలు ఉంటాయి. రెండు రకాల
గ్రంథి కణాలు ఉంటాయి. ఇవి ఎంజైములను, శ్లేష్మాన్ని
స్రవించేవి. జఠర చర్మంలోని కణాలను కింద వివరించడమైనది.
(ఎ) పోషక కండర కణాలు : ఇవి దాదాపుగా బాహ్య చర్మకణాలను
పోలి ఉంటాయి. కానీ నిర్మాణంలో భిన్నంగా ఉంటాయి. వీటి బాహ్య భాగం కండర కీలితాలుగా
విస్తరిస్తుంది. వాటిలో సన్నటి సంకోచ తంతువులుంటాయి. ఈ కీలితాలు శరీర అక్షానికి
లంబకోణంలో అమరి ఉండటం వల్ల వాటి సంకోచ భాగాలు‘ అడ్డు
కండరాలుగా పనిచేస్తాయి. ఈ కండర కీలితాలు ముఖ్యంగా నోటి చుట్టూ అధికంగా ఉండటం వల్ల
ఇవి సంవరణులుగా పనిచేసి నోటిని మూయడానికి, తెరవడానికి
తోడ్పడతాయి. ఈ కణాల లోపలి భాగం అంతర గుహికలో స్వేచ్ఛగా ఉంటుంది. వీటికి
కశాభాలుంటాయి. మిథ్యాపాదాలు కూడా ఏర్పడతాయి. కశాభాల కదలికల వల్ల ఆహారం ఒక
క్రమపద్ధతిలో చలిస్తూ ఉంటుంది. మిథ్యా పాదాలు ఆహారాన్ని మింగి కణాంతర జీర్ణక్రియ
జరుపుతాయి.
గ్లైకోజన్ రేణువులు కశాభం Sara విభాజక
డెస్మొసోమ్ ఆహారరిక్తికలు ఆహారరిక్తికలు అంతర్జీవ ద్రవ్యం జాలకం –కణాంతర అవకాశం జీర్ణంకాగా మిగిలిన వ్యర్థ పదార్థాలు కేంద్రకం స్రావక రేణువులు
గాల్టి సంక్లిష్టం కణాంతర అవకాశం – కేంద్రకాంశం కేంద్రకంఅన్న కండర కండర కీలితం
కొవ్వు గుళికలు:కండర కీలితాలు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఈ కణాల
స్వేచ్ఛా తలం అనేక సూక్ష్మ చూషకాలను, రెండు లేదా మూడు
కశాభాలను కలిగి ఉందని తెలిసింది. ఒక్కొక్క కశాభం 9 + 2 తంతువుల
కట్టలతో ఏర్పడి ఉంటుంది. జీవపదార్థంలో మైటోకాండ్రియాలు, గ్లైకోజన్
రేణువులు, ఆహార రిక్తికలు, నునుపు
గరుకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రైబోసోములు, లిపిడ్ బిందువులు, కేంద్రకానికి దగ్గరగా ఉన్న గాలి
దేహాలు ఉంటాయి. (బి) గ్రంథి కణాలు : పోషక కండర కణాల మధ్యలో అక్కడక్కడ చిన్న కురచైన
గ్రంధీకణాలుంటాయి. ఈ కణాల్లో రేణువుల వంటి జీవ పదార్థం ఉంటుంది. ఇవి జరర ప్రసరణ
కుహరంలోకి జీర్ణ రసాలను స్రవిస్తాయి. మిగిలిన కణాలు బాహ్య చర్మ కణాల లాగా ఉంటాయి.
అధిక భాగాన్ని ఏర్పరుస్తుంది. దీనిలో అధిక సంఖ్యలో స్థితిస్థాపక తంతువులు అనేక
శాఖలతో ఉంటాయి. బాహ్య చర్మం నుంచి ఏర్పడిన తిరిగే అమీబాయిడ్ కణాలుంటాయి. ఇది
దాదాపుగా సంధాయక కణజాలం లాగా ఉన్న కోలెన్ కైమా. ఈ స్తరంలో గల నీరు సముద్రపు నీటిని
పోలి ఉంటుంది. కానీ ఇందులో ఎక్కువ పొటాషియం, తక్కువ
సల్ఫేట్లు ఉంటాయి.
